Childrens : మీ చిన్నారులు రాత్రి నిద్రపోవడం లేదా? ఈ ఐదు టిప్స్ పాటిస్తే చాలు.. టైముకు బెడ్ ఎక్కాల్సిందే!

Childrens : ఆరోగ్యం బాగుండాలంటే తగినంత నిద్ర అవసరం. ముఖ్యంగా చిన్నారులు రోజూ 8 గంటలు పడుకోవాల్సిందే. అప్పుడే వారి శారీరక, మానసిక ఆరోగ్యం ఎదుగుదల బాగుంటుంది. ఇందుకు నైట్‌టైమ్ స్లీప్ రొటీన్ క్రియేట్ చేయాలి. రోజూ ఒకే సమయంలో పడుకోవడం.. ఉదయం దాదాపుగా ఒకే సమయంలో నిద్రలేవడం అలవాటు చేస్తే మంచిది. నైట్‌టైమ్ స్లీప్ రొటీన్ పిల్లల్లో ఇమ్యూనిటీ పవర్ ను కూడా పెంచుతుంది. ఆందోళన తగ్గిస్తుంది. పిల్లలు రాత్రి చక్కగా నిద్రపోవాలంటే ఈ ఐదు బెడ్ టైమ్ హ్యాబిట్స్ నేర్పిస్తే సరిపోతుంది.

ఈవినింగ్ బాత్..
రాత్రి నిద్రకు ముందు స్నానం చేస్తే రిలాక్స్‌ గా అనిపిస్తుంది. ముఖ్యంగా స్కూల్ కు వెళ్లిన వచ్చిన తర్వాత చిన్నారులు ఎనర్జిటిక్‌గా ఉండాలంటే ఈవినింగ్ బాత్ మంచి అలవాటు. బయట ఆటలు ఆడి వచ్చిన తర్వాత స్నానం చేస్తే విశ్రాంతి కలుగుతుంది. రాత్రి సుఖంగా నిద్ర పోవచ్చు.

బ్రషింగ్..
పిల్లలు రాత్రి బెడ్ మీదకు వచ్చే ముందు పండ్లు తోముకోవడం వంటి సెల్ఫ్ కేర్ హ్యాబిట్స్ నేర్పించాలి. ఈ అలవాట్ల వల్ల పరిశుభ్రతపై అవగాహన కలుగుతుంది. నిద్రపోయే ముందు బ్రష్ చేసుకుంటే పాచి, బ్యాక్టీరియా తొలగిపోతాయి. పళ్లు పుచ్చిపోవడం, నోటి దుర్వాసన వంటి సమస్యలు ఉండవు.

బెడ్ టైం స్టోరీస్..
పిల్లలు పడుకునే ముందు బెడ్ టైం స్టోరీస్ చెప్పడం చాలా మంచి అలవాటు. ఇది వారి మానసిక ఆరోగ్యాన్ని మరింత పెంచుతుంది. ముఖ్యమంగా నానమ్మ, అమ్మమ్మ ఇలా చేయడం చాలా మంచిది. ఈ అలవాటు తల్లిదండ్రులు, పిల్లల మధ్య బంధాన్ని పెంచుతుంది. కథలు వింటూ పిల్లలు కొత్త ఊహా లోకంలో మునిగి తేలుతారు. వారి ఇమేజినేషన్ పవర్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. చిన్నారుల క్రియేటివిటి, నాలెడ్జ్ పెరుగుతాయి.

వాటర్ బాటిల్
రాత్రి నిద్రిస్తున్న సమయంలో దాహం వేయవచ్చు. అందుకే వారి బెడ్ వద్ద్ ఎప్పుడూ వాటర్ బాటిల్ ఉండేలా చూడాలి. పిల్లలు సరిపోయినంత నీటిని తాగాలి. లేదంటే డీహైడ్రేట్ అవుతారు. దీంతో అలసట, తలనొప్పి వంటి సమస్యలు వస్తాయి. నిద్ర కూడా సరిగా పట్టదు. వాటర్ ఎక్కువగా తాగితే మలబద్ధకం సమస్యలు కూడా తొలగిపోతాయి. వారి స్కిన్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది.

పడుకునే ముందు పిల్లలకు ఫోన్లు ఇవ్వద్దు. టీవీ, ట్యాబ్, కంప్యూటర్ వంటి బ్రైట్ స్క్రీన్స్ చూడద్దు. ఇలాంటి వాటి నుంచి వచ్చే కాంతి నిద్రను దూరం చేస్తుంది. అందుకే వారి మూడ్ కు అనుగుణంగా బెడ్ రూంను సెట్ చేయాలి. వారికి నిద్ర సమస్యలు ఉంటే డీప్ బ్రీత్ మెడిటేషన్ వంటి రిలాక్సేషన్ టెక్నిక్స్ నేర్పించాలి.

TAGS