WhatsApp Simple Tips : వాట్సప్ లాగిన్ అవట్లేదా? ఈ సింపుల్ టిప్స్ యూజ్ చేస్తే సరి!
WhatsApp Simple Tips : స్మార్ట్ ఫోన్ లేని ఇళ్లు ఇప్పుడు ఉంటుందంటే ఆశ్చర్యమే. చిన్న పూరి గుడిసె అయినా సరే.. వ్యక్తి గత, సామాజిక అవసరాల కోసం స్మార్ట్ ఫోన్ ఉండాల్సిందే. ఇక ఫోన్ లో ముఖ్యమైన యాప్ (అప్లికేషన్) వాట్సప్. ఒక్క వాట్సప్ ఉంటే చాలు గల్లీ నుంచి గ్రహాల వరకు ప్రతీ సమాచారం అందులో షేర్ అవుతూనే ఉంటుంది. ఇక గ్రూపుల విషయానికి వస్తే గల్లీ గ్రూప్, స్ట్రీట్ గ్రూప్, విలేజ్ గ్రూప్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో గ్రూపులు దానిలో చాటింగ్ లు, వీడియోతో మీటింగులు జీవితంలో అత్యంత విలువైన యాప్ ఏదైనా ఉందంటే అది వాట్సప్ మాత్రమే అని ఘంటాపథంగా చెప్పవచ్చు.
ఒక వేళ ఏదైనా పరిస్థితులో యాప్ నుంచి లాగౌట్ అయితే ఏం చేస్తాం. మళ్లీ లాగిన్ అవుతుంటాం. ఒక్కోసారి ఇది పెద్ద సమస్యగా మారుతుంది. ఎన్ని సార్లు లాగిన్ అయినా అకౌంట్ యాక్సెస్ కాకపోవచ్చు అప్పుడు ఏం చేయాలి. ఈ సింపుల్ ట్రిక్స్ వాడితే సరిపోతుంది అవేంటో చూద్దాం.
రీ ఇన్‌స్టాల్ వాట్సప్
-మొబైల్ లో వాట్సప్ అన్ ఇన్‌స్టాల్ చేయండి.
– డివైజ్ యాప్ స్టోర్ ఆంద్రాయిడ్ అయితే గూగుల్ ప్లే, యాపిల్ అయితే యాప్ స్టోర్ నుంచి ఇన్ స్టార్ చేయాలి.
– అప్లికేషన్ ను ఓపెన్ చేసి, ఫోన్ నెంబర్ వెరిఫై చేసి సెటప్ ప్రాసెస్‌ను ఫాలో అవ్వండి.
ఫోన్ SMS సర్వీస్
ఫోన్ SMS సర్వీస్ సరిగా ఉందో లేదో చూసుకోవాలి. లేదంటే వెరిఫై ప్రాసెస్ లో వాట్సప్ ఓపీటీ(OTP)లు రావు. అప్పుడు SMS సర్వీస్ను ఎనేబుల్ చేయచ్చు. లేదంటే కాల్ బేస్డ్ వెరిఫికేషన్ ఆప్షన్ ను ఎంచుకోవాలి.
క్లియర్ క్యాష్
– ఫస్ట్ ఫోన్ సెట్టింగ్స్ ఓపెన్ చేయాలి.
– యాప్స్(Apps) లేదంటే అప్లికేషన్స్(Applications) ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
– యాప్‌ల లిస్టులో వాట్సప్ ను వెతికి, దానిపై ట్యాప్ చేయండి.
– ‘స్టోరేజ్’ ఆప్షన్ ను ఎంచుకోం.
– తర్వాత ‘క్లియర్ డేటా’ లేదంటే ‘క్లియర్ క్యాష్’ ఆప్షన్‌ను ఎంచుకోండి.
– ఫోన్‌ను రీస్ట్రార్ట్ చేసి మళ్లీ లాగిన్ అయ్యేందుకు ప్రయత్నించండి.
వెరిఫై ఫోన్ నంబర్
వాట్సప్ యాప్ ప్రతీ ఫోన్ నెంబర్ కు ప్రత్యేక ఐడీ ఉపయోగిస్తుంది. వాట్సప్ అకౌంట్‌తో అసోసియేట్ అయిన ఫోన్ నెంబర్ ను ఎంటర్ చేయాలి. ఒకటికి రెండు సార్లు నెంబర్ ను చెక్ చేసుకోవాలి. కంట్రీ కోడ్, ఫోన్ నెంబర్ ను వెరిఫై చేసుకోవాలి. ఒక వేళ ఫోన్ నెంబర్ మారిస్తే దాన్ని వాట్సప్ సెట్టింగ్స్ లో అప్ డేట్ చేయడం మర్చిపోవద్దు.
ఇక వై-ఫై లేదంటే నెట్ వర్క్ నుంచి డేటా సరిగ్గా అందుతుందో లేదో సరిచూసుకోవాలి. ఇంకా ఏమైనా సమస్యలు వస్తే వాట్సప్ టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేయాలి. వారు సమస్యలను పరిష్కరించడంలో సాయం చేస్తారు.