JAISW News Telugu

RCB captain : మళ్లీ ఆర్సీబీ కెప్టెన్ గా విరాట్ కొహ్లి..!

RCB captain : విరాట్ కొహ్లీ, ఆయన ఆట తీరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ పరుగుల రికార్డును బ్రేక్ చేసిన కొహ్లీ ప్రంపంచలో మేటి ఆటగాడిన నిలిచాడు. బ్యాట్ తో పిచ్ పై అడుగుపెడితే చాలు ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరుగెత్తాల్సిందే. కేవలం రన్స్ మాత్రమే కాకుండా ఎంటర్ టైన్ మెంట్ ను కూడా అందించే ఆటగాళ్లలో ఫస్ట్ వరుసలో ఉంటారు. ఆయన రీల్స్ ఇప్పటికి ఎన్ని వైరల్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక ఐపీఎల్ లో సైతం ఆయన ప్రత్యేకత నిరూపించుకున్నాడు. 2008లో RCB కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టిన కొహ్లీ ఉత్తమ ప్రతిభ కనబరిచినా కప్పు మాత్రం తీసుకురాలేకపోయాడు. 2016లో ఫైనల్ వరకు వెళ్లినా కప్పు మాత్రం తీసుకురాలేదు. కానీ ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకునే అవకాశాన్ని కోల్పోయింది.

ఆర్సీబీ అభిమానుల్లో విరాట్ పై భిన్నమైన క్రేజ్ ఉంది. అతని కెప్టెన్సీలో జట్టు దూకుడుగా ఉంది. కొహ్లీ 2016 నుంచి 2021 వరకు కెప్టెన్‌గా ఉన్నాడు. ఇందులో RCB 144 మ్యాచ్‌లు ఆడింది. 66 గెలవగా, 70 ఓడిపోయింది. 2022లో ఫాఫ్ డు ప్లెసిన్ ఆర్సీబీ బాధ్యతలు తీసుకున్నాడు. ఈయన సారధ్యంలోనూ జట్టు ట్రోఫీ సాధించలేకపోయింది. అయితే మళ్లీ ఆర్సీబీ బాధ్యతలు చేపట్టాలని కొహ్లీ అనుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. ఇది నిజమైతే ఆర్సీబీ ఫ్యాన్స్ కు పండగే. అయితే ఫ్రాంచైజీలు కూడా అందుకు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.

Exit mobile version