Fish : ఈ చేపకు మొప్పలే కాదు.. కాళ్లూ ఉన్నాయి.. ఎక్కడో తెలుసా?
Fish with legs : జల చరాలైన చేపలు మొప్పల సాయంతో నీళ్లల్లో ఈదుతుంటాయి. ఈ చేపల్లో ఎన్నో రకాలు ఉంటాయి. సముద్ర ప్రాంతాల్లో వివిధ రకాల జాతులను గుర్తిస్తుంటారు. అయితే ఒక రకమైన చేప ప్రస్తుతం అంతర్జాతీయ పరిశోధకులను సైతం ఆశ్చర్య పరుస్తుంది. హార్వర్డ్, స్టాన్‌ఫోర్డ్ పరిశోధకులఇటీవలి అధ్యయనాలు ఈ విషయాన్ని వెల్లడించాయి.
చేపలకు మొప్పలు ఉండడం సహజం. హార్వర్డ్, స్టాన్‌ఫోర్డ్ పరిశోధకులు ఈ చేపకు ఆరు కాళ్లు ఉన్నట్లు గుర్తించారు. దీనిని ప్రస్తుతానికైతే రాబిన్ ఫిష్ అని పిలుస్తున్నారు. ఈ చేప సముద్రపు అడుుగు భాగంలో సంచరిస్తుండగా పరిశోధకులు గుర్తించారు. చేపలు కాళ్లు కలిగి ఉండవు. అయితే ఈ రాబిన్ ఫిష్ ప్రత్యేకత ఏమిటంటే ఆరు కాళ్లతో సముద్ర గర్భంలో తిరుగుతూ కనిపిస్తున్నాయి. సైన్స్ న్యూస్ ప్రకారం, రాబిన్ ఫిష్ వాటి పాదాలతో రసాయనాలను గ్రహించగలవని గత పరిశోధనలో తేలింది.
పరిశోధకులు మొదట రాబిన్ ఫిష్ కాళ్లు నిజంగా ఇంద్రియ అవయవాలు అవునో కాదో తెలుసుకోవడానికి ప్రయత్నించారు. వరుస ప్రయోగాల ద్వారా పరిశోధకులు రాబిన్ ఫిష్ వేటాడే విధానాన్ని సునిశితంగా పరిశీలించారు. ఇది సముద్రపు అడుగుభాగంలో ఈత, నడక మధ్య ప్రత్యామ్నాయంగా ఉంటుందని గుర్తించారు. మొదట వీటిలో స్పర్శ, రసాయన సంకేతాలకు అత్యత సున్నితంగా ఉన్నట్లు గుర్తించారు. వీటిలో ఆధునిక ఇంద్రియ సామర్థ్యాలు లేవని శోధించారు.
View this post on Instagram