JAISW News Telugu

The stag beetle : ఈ పురుగు మీ పరిసరాల్లో ఉందా? కోటీశ్వరులైనట్లే.. రూ.75 లక్షలు స్పాట్ పేమంట్ అట!

The stag beetle  ఈ సమస్త జీవ ప్రపంచంలో ఒక్కో జీవికి ఉపయోగం ఒక్కో విధంగా ఉంటుంది. దేని ఉపయోగం ఎలా ఉంటుందన్నది శాస్త్రవేత్తలు నిర్ణయిస్తారు. గతంలో రెండు తలల పాము ఇంట్లో ఉంటే జాతకం మారుతుందని చెప్పేవారు.

దీంతో ఆ పాము కోసం అడవులు, చెట్లు, పుట్టలెంట తిరిగారు. చాలా మంది పాపం అది ఒక బిజినెస్ గా కూడా మొదలైంది. దీంతో అధికారులు దీనిపై గట్టి నిఘాపెట్టి కేసులు పెట్టడంతో తగ్గింది. అయితే రెండు తలల పాము దగ్గరుంటే కోటీశ్వరులు అవుతారన్నది కేవలం మూఢనమ్మకం మాత్రమే. ఇలాంటిది మరోటి తయారైంది. అది ఒక పురుగు గురించి.

ఆ పురుగు పేరు ‘స్టాగ్‌ బీటిల్‌’. దీని ధర అక్షరాలా రూ.75 లక్షలు. ఈ పురుగును అదృష్టానికి చిహ్నంగా భావిస్తారు. ఇంట్లో తెచ్చిపెట్టుకుంటే సదరు వ్యక్తిని లక్షాధికారిని అవుతాడట. ఇది చెక్కను తిని జీవించే జాతికి చెందినది. లండన్‌కు చెందిన ‘నేచురల్‌ హిస్టరీ మ్యూజియం’ నివేదక ప్రకారం.. ఈ పురుగు బరువు 2-6 గ్రాముల మధ్యలో ఉంటుందట.

దాదాపు ఈ పురుగు మూడు నుంచి ఏడు సంవత్సరాలు జీవిస్తుంది. మగపురుగులు 35 నుంచి 70 మిల్లీ మీటర్ల పొడవు.. ఆడపురుగు 30 నుంచి 50 మిల్లీ మీటర్ల పొడవు ఉంటాయి. ఈ కీటకాలను చికిత్సల్లో కూడా వాడుతారు. ఈ పురుగుల కొండీలు మగ జింకల కొమ్ములను పోలి ఉండటంతో వీటికి ‘స్టాగ్‌ బీటిల్స్‌’ అనే పేరు వచ్చింది. ఇవి సంతానోత్పత్తి సమయంలో ఆడపురుగులతో జత కట్టేందుకు ఈ కొండీలను కొడుతూ విచిత్రమైన శబ్ధాన్ని పుట్టిస్తాయి.

Exit mobile version