JAISW News Telugu

Day 25 hours : భూమికి దూరమవుతున్న చంద్రుడు.. ఇకపై రోజుకు 25 గంటలు!

 25 hours

25 hours

Day 25 hours :  చందమామ గురించి కథలు లేదా సినిమాల్లో వింటూనే ఉన్నాం. చూస్తూనే ఉన్నాం.. చంద్రుడు మన భూమికి ఉపగ్రహం మాత్రమే కాదు, మనతో భావోద్వేగ సంబంధాన్ని కలిగి ఉన్నాడు. తాజాగా చంద్రుడి గురించి శాస్త్రవేత్తలు భయానక హెచ్చరిక జారీ చేశారు. ఒక పరిశోధన ప్రకారం.. చంద్రుడు నిరంతరం మన భూమి నుంచి దూరంగా కదులుతున్నాడు. దీనివల్ల భవిష్యత్తులో చాలా దుష్ప్రభావాలు కనిపించవచ్చు. రాబోయే కాలాన్ని కూడా ఇది మారుస్తుంది. చంద్రుడు ప్రతి సంవత్సరం భూమికి 3.8 సెంటీమీటర్ల దూరం కదులుతున్నాడని కూడా శాస్త్రవేత్తలు తెలిపారు.

విస్కాన్సిన్-మాడిసన్ విశ్వవిద్యాలయానికి చెందిన బృందం 90 మిలియన్ సంవత్సరాల చంద్రుని గురించి పెద్ద హెచ్చరిక జారీ చేసింది. చంద్రుడు సంవత్సరానికి సుమారు 3.8 సెంటీమీటర్ల చొప్పున భూమి నుంచి దూరమవుతున్నాడని.. ఇది మన భూమిపై ప్రభావాన్ని చూపుతుందని పరిశోధనలో తేలింది. ఫలితంగా 200 మిలియన్ సంవత్సరాలలో భూమిపై రోజు 25 గంటలు ఉంటుంది. 1.4 బిలియన్ సంవత్సరాల క్రితం భూమిపై ఒక రోజుకు 18 గంటల పాటు కొనసాగిందని అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే చంద్రుడు భూమి నుంచి దూరంగా వెళ్లడం కొనసాగిస్తున్నందున రోజు పొడవు నిరంతరం పెరుగుతోంది.

దీనికి ప్రధాన కారణం భూమి  – చంద్రుని మధ్య గురుత్వాకర్షణ తగ్గిపోవడమే అని యూనివర్సిటీకి చెందిన జియాలజీ ప్రొఫెసర్ స్టీఫెన్ మేయర్స్ అన్నారు. చంద్రుడు భూమికి దూరమవుతున్నాడన్న పరిశోధన కొత్తదేమీ కాకపోవడం గమనార్హం. శాస్త్రవేత్తలు దశాబ్దాలుగా ఇటువంటి వాదనలు చేస్తున్నారు.

కానీ, ఉల్కలు, చంద్రునిపై అధ్యయనం చేసిన తరువాత, విస్కాన్సిన్-మాడిసన్ విశ్వవిద్యాలయం ప్రతి సంవత్సరం చంద్రుడు భూమి నుండి దూరంగా కదులుతున్నట్లు ఆధారాలతో ధృవీకరించింది.  చంద్రునిపై ఒక రోజు భూమిపై 14 రోజులకు సమానం. ఇది కాకుండా, చంద్రునిపై ఉష్ణోగ్రత పగటిపూట చాలా ఎక్కువగా ఉంటుంది. రాత్రికి అంతే సమానంగా చల్లగా ఉంటుంది. చంద్రుని దక్షిణ ధ్రువంతో సహా చీకటి ప్రదేశాలలో, రాత్రి ఉష్ణోగ్రత -200 డిగ్రీల వరకు ఉంటుంది. పగటిపూట ఉష్ణోగ్రత 100 డిగ్రీల కంటే ఎక్కువగా ఉంటుంది.

Exit mobile version