Karthika Masam 2023 : హిందూమతంలో కార్తీక మాసానికి ప్రత్యేకత ఉంటుంది. శివకేశవులకు ప్రీతిపాత్రమైన మాసం కావడంతో ఈ నెలలో దేవాలయాల సందర్శన ఎంతో పుణ్యం ఇస్తుందని చెబుతారు. కార్తీక మాసంలో సోమవారానికి ప్రాధాన్యం ఉంటుంది. ఈనెలలో నదీస్నానం మరింత పుణ్యం ఇస్తుందని అంటారు. అందుకే నదీస్నానం చేస్తే మంచిదని నదుల్లో స్నానాలు చేయడానికి మొగ్గు చూపుతారు.
కార్తీక మాసంలో శివుడిని, విష్ణువును పూజించడం వల్ల వారి అనుగ్రహం కలుగుతుంది. వారిని ప్రసన్నం చేసుకునేందుకు ఇష్టపడుతుంటారు. నదీస్నానం, జపం, ఆరాధన, ధ్యానం చేయడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుందని మన పురాణాలు చెబుతున్నాయి. కార్తీక మాసంలో చేసే పూజలకు ఎంతో నియమ నిష్టలతో పూజలు చేస్తుంటారు. ఈనేపథ్యంలో కార్తీక మాసం విశిష్టత గురించి తెలుసుకుని పూజలు జరుపుకుంటారు.
కార్తీక మాసం విశిష్టత గురించి తెలుసుకుని ఆ దిశగా నడుచుకుని పూజలు చేయడం వల్ల మన ఇంట్లో కూడా మంచి విశేషాలు కలుగుతాయి. శివకేశవుల ఆలయాల్లో పూజలు, అభిషేకాలు, యజ్ణాలు చేస్తుంటారు. ఈ కాలంలో కేవలం కూరగాయల భోజనమే సురక్షితం. మాంసాహారాలకు దూరంగా ఉండాలని సూచిస్తుంటారు.
కార్తీక మాసంలో సోమవారం ఉపవాసం ఉండటం మంచిది. నదీ స్నానం చేసి భక్తి శ్రద్ధలతో దీపాలు వెలిగిస్తే పుణ్యఫలం దక్కుతుంది. ఒంటిపూట భోజనం చేయడం కూడా మంచి ఫలితాలు ఇస్తుంది. కార్తీక మాసంలో ప్రతి ఒక్కరు తమ స్థాయికి తగినట్లు దానాలు చేయడం వల్ల కూడా మనకు ఒనగూడే లాభాలు ఎక్కువగా ఉంటాయి. ఇలా కార్తీక మాసం ప్రాశస్త్యాన్ని గుర్తించి నడుచుకుంటే మంచిది.