Sleeping Winner : పోటీ ప్రపంచంలో మనగలగాలంటే ఉరుకులు పరుగులు కామన్. దీంతో ఒత్తిడి పెరిగి అనారోగ్య సమస్యలు, వాటితో లైఫ్ స్పాన్ చాలా వరకు తగ్గిపోతుంది. జీవితం ఆనందంగా గడపాలంటే కేవలం డబ్బు ఉంటే సరిపోదు. మనిషి, కుటుంబం సౌకర్యవంతంగా బతికేందుకు డబ్బు అవసరమే.. కానీ, ఆరోగ్యం అరోగ్యం నాశనం చేసుకునేంత అవసరం లేదు. దీన్ని అర్థం చేసుకున్న ఒక కంపెనీ ఒక ప్రోగ్రామ్ ను కండెక్ట్ చేసింది. అదే వేక్‌ఫిట్ స్లీప్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ (నిద్రపోయి డబ్బు గెలుచుకోవడం). దీనిలో బెంగళూర్ కు చెందిన ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్ సాయిశ్వరి పాటిల్ మూడో సీజన్‌లో పాల్గొని రూ. 9 లక్షలు, ‘స్లీప్ ఛాంపియన్ షిప్’’ టైటిల్ గెలుచుకున్నారు. వేక్‌ఫిట్ ప్రోగ్రామ్ కోసం ఎంపిక చేసిన 12 మంది ‘స్లీప్ ఇంటర్న్‌లలో’ పాటిల్ ఒకరు. ఈ ప్రోగ్రామ్ ప్రతీ ఒక్కరినీ రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకు నిద్ర పోవాలని ప్రోత్సహిస్తుంది. ఇందులో నిద్రపోయిన వారిని ప్రీమియం మీటర్స్, కాంటాక్ట్‌లెస్ స్లీప్ ట్రాకర్‌తో పరీక్షిస్తారు. ఈ కార్యక్రమం నిద్ర యొక్క ఆవశ్యకత తెలిపేందుకే అని వేక్ ఫిట్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్, కునాల్ దూబే అన్నారు. అయితే ఇందులో అత్యంత ఆనందంగా గాఢ నిద్రపోయిన సాయిశ్వరి పాటిల్ కు ప్రైజ్ మనీగా రూ. 9 లక్షలు అందజేసినట్లు నిర్వాహకులు తెలిపారు.