Healthy Person Urinate in a Day : ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి రోజుకు ఎన్నిసార్లు మూత్రం పోయాలో తెలుసా?
Healthy Person Urinate in a Day : మనం రోజు ఆహారం తీసుకుంటాం. ఆహారంతో పాటు నీళ్లు తాగుతుంటాం. తగినంత నీళ్లు తాగకపోతే రోగాలు చుట్టుముడతాయి. శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపే క్రమంలో మూత్రం, మలం ప్రధానంగా ఉపయోగపడతాయి. వాటి ద్వారా మన లోపలి మలినాలను బయటకు పంపుతుంది. దీంతో శరీరంలో ఎన్నో రకాల చర్యలు జరుగుతాయి. ఏ అవయవమైనా సరిగా పనిచేయాలంటే నీళ్లు తాగడమే సరైన పరిష్కారం.
మనం తిన్న ఆహారాలను కాలేయం జీర్ణం చేస్తుంది. కిడ్నీలు మన రక్తాన్ని వడపోస్తాయి. మెదడు మనకు వచ్చే సంకేతాలను పంపిస్తుంది. శరీరంలోని మలినాలను మూత్రం, మలం ద్వారా బయటకు తోస్తుంది. మూత్రం విషయంలో చాలా మందికి సందేహాలు ఉంటాయి. మూత్రం ఎన్నిసార్లు పోయాలి? ఎలా పోయాలి? అనే విషయాలపై అనేక అనుమానాలుంటాయి.
రోజుకు మూత్రం ఎన్నిసార్లు పోవాలంటే ఆరోగ్యవంతమైన వ్యక్తి రోజుకు ఏడు సార్లు మూత్రం పోయాలి. తక్కువగా పోసినా ఎక్కువగా పోసినా ఆరోగ్యం బాగా లేనట్లే లెక్క. మూత్ర విసర్జన గురించి అవగాహన ఉంచుకోవాలి. మూత్ర విసర్జన చేసే కాలం ఏడు సెకండ్లు ఉండాలి. రెండు సెకండ్ల కంటే తక్కువ మూత్రం పోసినా ఏదో ఇన్ఫెక్షన్ ఉన్నట్లు భావించుకోవాలి.
మూత్రం పోసే సమయంలో రంగు కూడా చూసుకోవాలి. మూత్రం తెల్లగా ఉంటే మనం నీళ్లు బాగా తాగుతున్నామని అర్థం. మూత్రం రంగు మారితే మన ఆరోగ్యం దెబ్బతిన్నట్లే అనుకోవాలి. మూత్రం ఎరుపు రంగులో వస్తే మూత్రంలో రక్తం కలుస్తుందని తెలుసుకోవాలి. పసిపిల్లల్లో నీలం రంగులో మూత్రం వస్తే లోపం ఉందని గుర్తించుకుని వైద్యులను సంప్రదించాలి.