Benefits of Cumin : జీలకర్రతో ఎన్ని లాభాలో తెలుసా?

Benefits of Cumin

Benefits of Cumin

Benefits of Cumin : మనం కూరల్లో వాడే దినుసుల్లో జీలకర్ర ఒకటి. మన వంటింట్లో పోపుల పెట్టెలో ఉండే జీలకర్రతో మనకు చాలా ప్రయోజనాలు ఉంటాయి. దీన్ని కూరల్లో వాడటం వల్ల మంచి వాసనతో పాటు రుచి వస్తుంది. మన ఆరోగ్యాన్ని కాపాడటంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. మనకు అవసరమయ్యే పోషకాలు ఇందులో పుష్కలంగా ఉంటాయి.

జీలకర్ర కడుపులో గ్యాస్, పుల్లటి తేన్పులు, కడుపు ఉబ్బరం, వికారం వంటి వాటిని రాకుండా చేస్తుంది. దీన్ని తినడం ద్వారా డయేరియా, కడుపులో నులిపురుగులు లేకుండా చేస్తుంది. ఒక టీ స్పూన్ జీలకర్ర, ఒక టీ స్పూన్ కొత్తిమీర రసం, చిటికెడు ఉప్పు కలిపి తిన్న తరువాత రెండు సార్లు తీసుకుంటే ఇవి తగ్గుతాయి. మధుమేహం, రక్తపోటుతో బాదపడే వారికి కూడా ఇది మంచి ఔషధంలా పనిచేస్తుంది.

నిద్రలేమి సమస్యను లేకుండా చేస్తుంది. జీకర్రను వేయించి అరటిపండుతో కలిపి తీసుకుంటే నిద్ర లేమి సమస్యకు చెక్ పెట్టొచ్చు. జ్వరం, గొంతునొప్పి, జలుబు వంటి సమస్యలకు కూడా చక్కని పరిష్కారం చూపుతుంది. చెమటపొక్కులతో బాధపడేవారు నిమ్మరసంలో జీలకర్ర పొడి కలిపి రాసుకుంటే ఫలితం ఉంటుంది. కడుపులో అల్సర్, పుండ్లు వంటి సమస్యలు వస్తే రోజు ఉదయం పరగడుపున టీ స్పూన్ జీలకర్ర పొడి కలుపుకుని తీసుకుంటే సమస్య లేకుండా పోతుంది.

దురద, ఇన్ఫెక్షన్లతో బాధపడేవారు ఆవు పాలల్లో మిరియాలు, జీలకర్ర పొడి కలిపి తలకు పట్టించి తలస్నానం చేస్తే సమస్య దూరం అవుతుంది. ఇలా జీలకర్ర మనకు ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. జీలకర్రను వంటల్లో వాడుకుంటే చాలా మేలు కలుగుతుంది. ఈనేపథ్యంలో జీలకర్ర పొడి వాడుకుని రుచితో పాటు రోగాలను దూరం చేసుకోవచ్చని తెలుసుకోవాలి.

TAGS