Business : ఐఏఎస్ కావాలనుకున్న అతడు 150 కోట్ల బిజినెస్ స్థాపించాడు.. జీవితం ఎలా మలుపుతిరిగిందంటే..?
business : ఐఏఎస్ కావాలని అతడు అనుకున్నాడు. కానీ కాలం అతన్ని బిజినెస్ వైపునకు అడుగులు వేయించింది. అబ్ధుల్ కలాం లాంటి పెద్దలు అంటారు.. నీవు వెళ్లాలనుకున్న దారిలో కంటే.. నిన్ను తీసుకెళ్తున్న దారినే ప్రేమించు అని. అనుభవ్ దూబే అలానే చేశాడు. నేడు 150 కోట్లకు పైగా సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేయగలిగాడు. అనుభవ్ మొదట సివిల్ సర్విసెస్ చదివి ఐఏఎస్ కావాలని అనుకున్నాడు. కానీ ఆ ప్రాయణాన్ని పక్కన పెట్టాడు. తనకు టీ పట్ల ఉన్న ప్రమను గ్రహించిన ఆయన దీన్నే బిజినెస్ గా మలుచుకోవాలని అనుకున్నాడు. 2016లో తన స్నేహితుడు ఆనంద్ నాయక్‌తో కలిసి ఇండోర్‌లో ‘చాయ్ సుత్తా బార్’ స్థాపించాడు. చాలా మందికి ఛాయ్ ఒక వ్యసనం. ఇది ఆరోగ్య కరమైనది కావడంతో ఎక్కువ మంది దీని వైపు మొగ్గు చూపుతారు. ఇది గ్రహించిన ఇద్దరు పెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించారు.
‘చాయ్ సుత్తా బార్ (CSB)’ ఇప్పుడు దేశంలోని 85 నగరాలు, దేశం వెలుపల 3 దేశాల్లో 200 కంటే ఎక్కువ అవుట్‌లెట్లను కలిగి ఉన్న బ్రాండ్. చాయ్ సుత్తా బార్ ఐదేళ్లలోపు ఇదంతా చేసిందంటే నమ్మ గలరా. అవును కేవలం ఐదేళ్లలోపు ఇదంతా చేసింది.
* వారు స్వయం సమృద్ధి సాధించాలనే ఆశతో దేశంలోని అనాథలు, వెనుకబడిన యువతకు ఉపాధి కల్పిస్తున్నారు.
* స్వతంత్రులుగా, స్వావలంబన కలిగిన వ్యక్తులను తయారు చేసేందుకు ప్రత్యేక సామర్థ్యం గల వ్యక్తులను నియమించడంలో నిమగ్నమై ఉన్నారు.
* ఇది మాత్రమే కాదు.. దేశంలోని కుమ్మరుల నుంచి క్రమం తప్పకుండా 3 లక్షలకు పైగా కుల్హాద్‌లను పొందుతున్నారు. ఇది వారికి సాధారణ ఉపాధిని పొందడంలో సహాయపడుతుంది.
చాయ్ సుత్తా బార్‌ను ప్రారంభించడం వెనుక ఉన్న ఆలోచన విద్యార్థులు, కార్మికులకు సేవ చేయడం. వీలైనన్ని ఎక్కువ రుచులను అందించడం.. అయితే ఇది చాయ్-ప్రేమికుల అవసరాలను తీర్చడం కంటే ఎక్కువగా మారింది.