JAISW News Telugu

Tirumala : తిరుమలకు చిన్న పిల్లలతో వెళ్తున్నారా! అయితే ఇది తెలుసుకోవాల్సిందే!!

Tirumala

Tirumala

Tirumala : తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని ప్రపంచం మొత్తం ఆర్తితో ఎదురు చూస్తుంది. ఎప్పుడు స్కూల్స్, ఉద్యోగాలకు సెలవులు దొరుకుతాయా? ఎప్పుడు తిరుమలకు వెళ్తామా? దేశ విదేశాల్లోకి భక్తులు ఎదురు చూస్తుంటారు. ఇంత మంది భక్తుల రాకపోకల్లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లు అన్ని ఏర్పాట్లు చేస్తుంది.

అలిపిరి ఘాట్ నుంచి తిరుమల వరకు టీటీడీ ఆధీనంలోనే ఉంటుంది. అలిపిరి నుంచి స్వామి వారి దర్శనం పూర్తయి కిందికి తిరిగి వచ్చే వరకు ప్రతీ భక్తుడు టీటీడీ నిబంధనలు పాటించాల్సిందే. తాజాగా టీటీడీ కొన్ని నియమాలను తెచ్చింది. అందుకే తిరుమలకు వెళ్లే వారు ఈ విషయాలు తెలుసుకోవాలి.

తిరుమలకు చిన్నారులతో వెళ్లేవారికి టీటీడీ కొన్ని సూచనలు చేసింది. తిరుమలలో మార్చి 3వ తేదీ పల్స్ పోలియో చేపట్టనుంది. టీటీడీ ఆధ్వర్యంలో ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తుంది.

పల్స్ పోలియో ఉదయం 6 గంటలకు ఆలయం ఎదుట ప్రారంభమై సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది. ఒక్క స్వామి వారి ఆలయం ఎదుటనే కాకుండా భక్తుల సౌకర్యార్థం వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. భక్తులు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి.

వివిధ ప్రాంతాల్లో నిర్వహణ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అశ్విని హాస్పిటల్, ఆర్టీసీ బస్టాండ్, జియన్ సీ టోల్ గేట్, సీఆర్ఓ, పీఏసీ 1 అండ్ 2, కొత్త బస్టాండ్, హెల్త్ ఆఫీస్, వీక్యూసీ 1 అండ్ 2, ఏటీసీ, ఎంబీసీ-34 వద్ద కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు.

వరాహస్వామి విశ్రాంతి గృహం-1, రాంభగీచా రెస్ట్ హౌస్-1, కేకేసీ, మేదరమిట్ట, పాపవినాశనం, సుపాదం, బాలాజీ నగర్ బాల బడి, బాలాజీ నగర్ వినాయక ఆలయం, ఎస్‌వీ హై స్కూల్, తిరుమల కోవెల క్యూ లైన్లు, ఉద్యోగుల డిస్పెన్సరీతో పాటు 25 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు.

టీటీడీ ఆధ్వర్యంలో శనివారం ఉదయం 10.30 గంటలకు ఎస్‌వీ హైస్కూల్ నుంచి బాలాజీ నగర్ వరకు అవగాహన ర్యాలీ ఉంటుంది. మధ్యాహ్నం 2 గంటలకు యాత్రికులు, ప్రయాణికుల కోసం వాహనాల్లో మైకుల ద్వారా ప్రకటన చేస్తారు.

ఈ క్రమంలో మీరు చిన్నారులతో తిరుమలకు వెళ్తే.. ఏమీ బయపడకుండా అక్కడ కూడా పోలియో చుక్కలు వేయించొచ్చు. అటు దైవ దర్శనం, ఇటు ఆరోగ్యం కూడా లభిస్తుంది. సర్వే జనా సుఖినో భవంతు.

Exit mobile version