Sleep Deprivation:అయ్య బాబోయ్..నిద్రపోకపోతే ఎన్ని రోగాలు వస్తాయో తెలుసా?
Sleep Deprivation:మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారం ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే అవసరం.. ఇది జగమెరిగిన సత్యం.. అయితే మనలో చాలా మంది మిగిలిన వాటికీ ఇచ్చిన ప్రాముఖ్యత నిద్రకు ఇవ్వరు. ఇదే అసలు సమస్య.. చాలా మంది చాలా తక్కువ సమయమే నిద్రపోతున్నారు. అందుకు కారణం కూడా లేకపోలేదు.
ఇప్పుడు ఉన్న పరిస్థితులలో అందరిదీ ఉరుకుల పరుగుల జీవితమే అయ్యింది. అంతేకాదు చాలా మంది సమయంతో సంబంధం లేకుండా పని చేస్తుంటారు.. అలాగే ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కూడా నిద్ర భంగానికి కారణం అవుతున్నారు. అర్ధరాత్రి వరకు వాటిని చూస్తూనే సమయం గడిపేస్తున్నారు. ఇవి కూడా సమయానికి నిద్రపోకుండా చేస్తున్నాయి.
మరి మీరు కంటినిండా నిద్రపోకపోతే అసలు ఏం జరుగుతుందో తెలుసా.. నిద్రలేమి కారణంగా ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. మరి నిద్రపోకపోతే ఎలాంటి అనారోగ్య సమస్యలు ఎటాక్ చేస్తాయో తెలుసుకుందాం..
నిద్ర లేకపోవడం వల్ల మానసిక ఆరోగ్యం ప్రభావితం అవుతుంది.. ఇది మెదడును ప్రభావితం చేసి డిప్రెషన్, యాంగ్జైటీ, స్ట్రెస్ వంటివి వచ్చేలా చేస్తుంది.. అలాగే మనిషి 7 నుండి 8 గంటల నిద్ర పోకపోతే జ్ఞాపకశక్తి సైతం కోల్పోవాల్సి వస్తుందట.. అంతేకాదు నిద్రలేని మీ ఆలోచన శక్తిని తగ్గించడమే కాకుండా మీకు ఏ పని మీద ద్యాస లేకుండా చేస్తుందని అంటున్నారు.
ఇంకా నిద్ర సరిగ్గా పోకపోతే మీ రోగనిరోధక శక్తి బలహీనంగా మారి తరచు ఏదొక అనారోగ్య సమస్య బారిన పడతారు.. ఇక నిద్రలేకపోతే హార్మోన్ల సమతుల్యత సైతం దెబ్బతిని ఆకలి, కోపం, ఒత్తిడి వంటి సమస్యలకు దారి తీసేలా చేస్తుంది. అలాగే నిద్రలేకపోతే జీవక్రియ కూడా సక్రమంగా పనిచేయక బరువు పెరిగే ఛాన్స్ ఉంది. అంతేకాదు ముఖం మీద నల్లటి వలయాలు ఏర్పడి, వయసు పైబడినట్టు కనిపించేలా చేస్తుందని నిపుణులు అంటున్నారు.