Swing states : స్వింగ్ స్టేట్స్ లో డొనాల్డ్ ట్రంప్ ముందంజ
అమెరికాలో మొత్తం 7 రాష్ట్రాలు స్వింగ్ స్టేట్స్ లేదా బ్యాటిల్ గ్రౌండ్ స్టేట్స్ హోదా పొందాయి. వాస్తవానికి, అమెరికాలోని చాలా రాష్ట్రాలు రిపబ్లికన్ లేదా డెమొక్రాట్ పార్టీకి బలంగా ఉన్నాయి. అయితే 7 రాష్ట్రాల్లోని ఓటర్లు ప్రతి ఎన్నికలలో తమ వైఖరిని మార్చుకుంటున్నారు. విస్కాన్సిన్, పెన్సిల్వేనియా, అరిజోనా, జార్జియా, మిచిగాన్, నెవాడా, నార్త్ కరోలినా. ఈ ఏడు స్వింగ్ స్టేట్స్‌లో ఎవరు ముందున్నారో తెలుసుకుందాం..
అరిజోనా: మొత్తం 11 ఎలక్టోరల్ ఓట్లు ఉన్నాయి. ఈ రాష్ట్రం నుంచి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ముందంజలో ఉన్నారు.
విస్కాన్సిన్: ఇక్కడ ఎలక్టోరల్ ఓట్ల సంఖ్య 10. ఈ రాష్ట్రంలో కూడా డొనాల్డ్ ట్రంప్ ముందంజలోనే ఉన్నారు.
పెన్సిల్వేనియా: ఈ రాష్ట్రంలో మొత్తం ఎలక్టోరల్ ఓట్ల సంఖ్య 19 కాగా, ఇక్కడి నుంచి కూడా ట్రంప్ ముందంజలో ఉన్నారు.
జార్జియా: మొత్తం 16 ఎలక్టోరల్ ఓట్లు ఉన్నాయి. ఇక్కడ కూడా రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఆధిక్యంలో ఉన్నారు.
నార్త్ కరోలినా: ఈ రాష్ట్రంలోనూ ట్రంప్ 16 ఎలక్టోరల్ ఓట్లతో ముందంజలో ఉన్నారు.
మిచిగాన్: ఈ రాష్ట్రంలో మొత్తం 15 ఎలక్టోరల్ ఓట్లు ఉన్నాయి. ఇప్పటి వరకు లెక్కింపులో డొనాల్డ్ ట్రంప్ ముందంజలో ఉన్నారు.
నెవాడా: మొత్తం 6 ఎలక్టోరల్ ఓట్లతో ఈ రాష్ట్రం నుంచి ఇప్పి దాకా ఎలాంటి ట్రెండ్‌లు వెలువడలేదు .