Swiggy : పదేళ్ల ‘స్విగ్గీ’ స్థాపించింది ఎవరో తెలుసా..? తొలిరోజు ఎన్ని ఆర్డర్స్ వచ్చాయంటే ?

Swiggy

Swiggy Founder

Swiggy Founder : ప్రస్తుతం ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది. ఇంట్లో కూర్చునే ప్రపంచాన్ని చుట్టేస్తున్నారు. ఇష్టమైన రెస్టారెంట్ల నుంచి నచ్చిన ఆహారాన్ని తెప్పించుకుని ఆస్వాదిస్తున్నారు. ఈ రోజుల్లో చాలా మంది బయట దొరికే రుచికరమైన ఆహారాన్ని ఆస్వాదిస్తున్నారు. బిజీ లైఫ్, పని ఒత్తిడి, సమయాభావం కారణంగా చాలా మంది వంట చేయకుండానే ఫుడ్ డెలివరీ యాప్‌లను ఉపయోగిస్తున్నారు. స్విగ్గీ, జొమాటోలపై ఆధారపడి ఈ యాప్‌లు ప్రజలకు అనుకూలమైన సేవలను కూడా అందిస్తున్నాయి. అందరికీ చేరువవుతూ వర్షం, పగలు, రాత్రి అనే తేడా లేకుండా నిత్యం రుచికరమైన ఆహారాన్ని అందిస్తున్నారు. అయితే.. ఫుడ్ డెలివరీ ప్రయాణంలో.. స్విగ్గీ సంస్థ పదేళ్లు పూర్తి చేసుకుంది. ఈ దశాబ్దపు తీపి జ్ఞాపకాలను పంచుకుంటూ కంపెనీ సహ వ్యవస్థాపకుడు, సీఈవో శ్రీహర్ష మాజేటి సోషల్ మీడియాలో ఓ పోస్ట్‌ను పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన సంస్థ తొలిరోజు ఆర్డర్ల గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించింది.

2014 ఆగస్టు 6న స్విగ్గీని ప్రారంభించామని.. ఫుడ్ ఆర్డర్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నామని చెప్పారు. కానీ, తొలిరోజు వారికి ఒక్క ఆర్డర్ కూడా రాలేదు. మరుసటి రోజే తనకు మొదటి ఆర్డర్ వచ్చిందని తెలిపారు. అదే తమ ప్రయాణం అసలు ప్రారంభానికి గుర్తుగా.. తమ తొలి భాగస్వాముల్లో ఒకరైన ట్రఫుల్స్ రెస్టారెంట్ నుంచి ఫుడ్ కోసం రెండు ఆర్డర్లు వచ్చాయని చెప్పారు. అప్పటి నుండి, వారితో వారి భాగస్వామ్యం బలపడింది. ఒకానొక దశలో ఒక్కరోజులోనే 7261 ఆర్డర్లు వచ్చాయని శ్రీహర్ష వెల్లడించారు. ఈ సందర్భంగా స్విగ్గీ కంపెనీ వృద్ధి గురించి కూడా వెల్లడించింది. ఫుడ్ డెలివరీ అనే కాన్సెప్ట్ ఇప్పుడిప్పుడే అందరికీ చేరుతున్న తరుణంలో తమపై నమ్మకం ఉంచినందుకు శ్రీహర్ష రెస్టారెంట్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం 3 లక్షల రెస్టారెంట్లతో పనిచేస్తున్నామని.. ఇది తమకు గర్వకారణమని చెప్పారు. ఈ ఆదరణ ప్రతి ఇంట్లో తమ పేరు వినిపించేలా చేసిందన్నారు. స్విగ్గీ 2014లో కర్ణాటక రాజధాని బెంగళూరులో ప్రారంభమైంది. స్విగ్గీని శ్రీహర్ష మాజేటి, నందన్ రెడ్డి,  రాహుల్ భాగస్వామ్యంతో ప్రారంభించారు. దీని కార్యకలాపాలు దాదాపు 600 నగరాలకు విస్తరించాయి.

TAGS