JAISW News Telugu

Dangers of Headache : తలనొప్పితో ఎలాంటి ప్రమాదమో తెలుసా?

Dangers of Headaches

Dangers of Headaches

Dangers of Headache : ప్రస్తుత జీవనశైలిలో మనకు తలనొప్పి సాధారణమైన సమస్యగానే భావిస్తున్నారు. మన ఆహార అలవాట్లు, అనారోగ్య కారణాలు తలనొప్పికి కారణంగా నిలుస్తున్నాయి. ఒత్తిడి, నిద్రలేమి వంటివి తలనొప్పికి హేతువుగా కనిపిస్తున్నాయి. దీంతో తలనొప్పిని అంత తేలిగ్గా తీసుకోలేం. ప్రతి నలుగురిలో ఇద్దరు నుంచి ముగ్గురు తలనొప్పితో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది.

తలనొప్పి అనేది జబ్బు కాదు అనేక వ్యాధుల కలయికతో కనబడేదని కొన్ని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఈనేపథ్యంలో తలనొప్పి వల్ల ఎలాంటి బాధలు ఉంటాయో తెలిసిందే. వయసు, లింగభేదం అనే తేడా లేకుండా అందరిలో తలనొప్పి వస్తుంటుంది. కానీ తలనొప్పిని అంత తేలిగ్గా తీసుకోకూడదు. సరైన చికిత్స తీసుకుంటే దాన్ని దూరం చేసుకోవడం సులభమే.

తలనొప్పి కొందరికి రోజు ఉంటుంది. ఇంకా కొందరికేమో వారానికి రెండు మూడు సార్లు వస్తుంటుంది. నిర్లక్ష్యం చేస్తే అది ఇతర సమస్యలకు దారి తీయవచ్చు. తలనొప్పి లక్షణాలు కనిపిస్తే వైద్యుడిని సంప్రదించి చికిత్స తీసుకుని పరిష్కారం చూసుకోవాలి. లేకపోతే ఇతర సమస్యలకు దారి తీసి మన ఆరోగ్యం దెబ్బతినడం ఖాయం. అందుకే తలనొప్పిని అంత నిర్లక్ష్యంగా చూడకూడదు.

తలనొప్పిని ఆదిలోనే దూరం చేసుకునేందుకు మందులు వాడాలి. చాలా మందిలో నిద్రలేమితో తలనొప్పి రావడం సహజం. మొదట్లోనే ఈ తలనొప్పి శాశ్వత నివారణ చర్యలు తీసుకోవడం ముఖ్యం. మైగ్రేన్, సైనస్ వంటి పేర్లతో పిలుస్తుంటారు. వీటితో ప్రమాదకరమే. ఈ నేపథ్యంలో ఈ తలనొప్పి నివారణ కోసం అన్ని చర్యలు తీసుకుని వాటిని దూరం చేసుకోవాలి.

Exit mobile version