Baldness : పురుషుల్లో బట్టతల సమస్య వేధిస్తోంది. అరవై ఏళ్లకు రావాల్సిన బట్టతల ఇరవై ఏళ్లలోనే రావడం సహజంగా మారింది. ఈనేపథ్యంలో బట్టతల రావడానికి కారణాలను పరిశీలిస్తే కొన్ని నిజాలు తెలుస్తున్నాయి. బట్టతల రావడానికి వారసత్వం, జన్యుపరమైన కారణాలుగా నిలుస్తాయి. మగవారిలోనే బట్టతల ఎందుకొస్తుంది? దీనికి మన ఆరోగ్య అలవాట్లు కూడా కారణంగా ఉంటాయి.
బట్టతల రావడానికి టెస్టోస్టీరాన్ అనే హార్మోను ప్రభావితం చేస్తుంది. దీంతో తలపై గడ్డాలు, చాతీపై వెంట్రుకలు వస్తాయి. హైబీపీ, డిప్రెషన్, క్యాన్సర్ వంటి ఆరోగ్య సమస్యలకు మందులు వాడే వారిలో బట్టతల వచ్చే అవకాశం ఉంది. థైరాయిడ్ గ్రంథి సమస్య ఉంటే కూడా బట్టతల వస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఇలా బట్టతల వచ్చే ప్రమాదం పొంచి ఉంటుంది.
వయసు పెరిగే కొద్దీ టెస్టోస్టిరాన్ హార్మోన్ ఉత్పత్తి తగ్గడం వల్ల కూడా జుట్టు రాలుతుంది. ఒత్తిడి, మానసిక ఆందోళన వల్ల కూడా చిన్న వయసులోనే బట్టతల వస్తుంది. అధిక ప్రభావం చూపే రసాయనాలను వాడటం వల్ల కూడా వెంట్రుకలు రాలిపోతాయి. ధూమపానం, మద్యపానం వల్ల కూడా జుట్టు రాలుతుంది. బట్టతల రావడానికి ఇన్ని కారణాలుగా నిలుస్తున్నాయి.
ప్రస్తుత పరిస్థితుల్లో జన్యుపరమైన లోపాలే అధికంగా కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో బట్టతల సమస్య చాలా మందిని ఇబ్బందులకు గురిచేస్తోంది. నలుగురిలో తిరగాలంటే గిల్టీగా ఫీలవుతున్నారు. బట్టతలతో కనిపించడం నామోషీగా భావిస్తున్నారు. జుట్టు రక్షణకు పలు నూనెలు వాడుతున్నా ఫలితం కనిపించడం లేదు. మనం తినే తిండి కూడా ఒక కారణంగానే ఉంటోంది.