Home Loan : గడువుకంటే ముందే హోమ్ లోన్ క్లోజ్ చేస్తున్నారా? అయితే ఈ విషయాలు మర్చిపోవద్దు..

Home Loan

Home Loan

Home Loan : ప్రతీ ఒక్కరూ కోరుకునేది సొంతిళ్లు. ప్రతీ వ్యక్తి తన కుటుంబం కోసం సొంతిళ్లు కట్టుకోవాల్సిందే. కానీ చాలీ చాలని జీతాలు, ఇంటి వెతలతో అది అంత తొందరగా సాధ్యం కాదు. కానీ దీనికి ఫుల్ స్టాప్ పెట్టి.. సొంతింటి కలను నెరవేర్చేది హోమ్ లోన్.. చాలా బ్యాంకులు హోమ్ లోన్ ఇస్తున్నాయి. అయితే రేట్ ఆఫ్ ఇంట్రస్ట్ మాత్రం ఆయా బ్యాంకులు, రెపోరేట్ ను బట్టి ఉంటుంది.

బ్యాంకుల ద్వారా లోన్ తీసుకొని ఇల్లు కట్టుకుంటే గడువు చాలా సంవత్సరాలు పెడతారు. సాధారణంగానే వారికి వచ్చే వేతనం, ఇంటి ఖర్చులన్నింటినీ పరిశీలించి బ్యాంకులే నెలకు ఇంత కడితే సరిపోతుందని చెప్తాయి. అలలా 15 నుంచి 20 సంవత్సరాలు (వారి వయస్సును కూడా పరిగణలోకి తీసుకొని) గడువు పెట్టుకుంటారు.

కానీ కుటుంబ అవసరాలు రేపటి భవిష్యత్ దృష్ట్యా లోన్ ను మరింత వేగంగా క్లోజ్ చేయాలని అనుకుంటారు. అయితే గడువుకు ముందే హోమ్‌లోన్‌ తిరిగి చెల్లిస్తున్నట్లయితే కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. వాటి గురించి క్షుణ్ణంగా తెలుసుకుందాం.

జప్తు రుసుములు
హోమ్ లోన్ చెల్లించిన తర్వాత సంబంధిత  ఖాతా క్లోజ్‌ అవుతుంది. ఈ ప్రక్రియకు ఎటువంటి రుసం ఉండదు. ఆర్‌బీఐ గైడ్ లైన్స్ ప్రకారం బ్యాంకు దీనికి ఎటువంటి చార్జిలు వసూలు చేయదు. మీరు కూడా ఎలాంటి జప్తు రుసుం చెల్లించాల్సిన అవసరం ఉండదు.

బ్యాంకుకు చెప్పాలి..
హోమ్ లోన్ కు సంబంధించి అసలు మొత్తాన్ని ఒకే సారి బ్యాంకులకు చెల్లించినప్పుడు ఆ విషయాన్ని తెలియజేయాలి. ఏవైనా మానవ తప్పిదాలు ఉంటే సరిచేయవచ్చు. బ్యాంకు జప్తు నియమాల గురించి మరింత సమాచారం తెలుసుకోవాలి. మీరు ఎంత ప్రిన్సిపల్ అమౌంట్ చెల్లించాలో తెలుస్తుంది. ఆ తర్వాత అకౌంట్‌ క్లోజ్‌ అవుతుంది.

పత్రాలను ఉపసంహరించుకోండి
హోమ్ లోన్ ఇచ్చే సమయంలో బ్యాంకులో ఇంటి స్థలం, ఇంటికి సంబంధించి కొన్ని డాక్యుమెట్లు డిపాజిట్ చేసుకుంటాయి. మీరు హోమ్ లోన్ తిరిగి చెల్లించే రోజున డిపాజిట్ చేసిన అన్ని డాక్యుమెంట్లను వెనక్కి తీసుకోవాలి. మీ ఆస్తి పత్రాలు, రిజిస్ట్రీని కలిగి ఉంటాయి. హోమ్‌లోన్‌ పూర్తిగా చెల్లించేప్పుడు ఇంపార్టెంట్ పేపర్స్ తిరిగి తీసుకోవడం మరిచిపోవద్దు.

TAGS