Check Health : మీరు ఆరోగ్యంగా ఉన్నారా? ఈ వీడియో చూసి ఇలా చెక్ చేసుకోండి..
Check Health : ఆరోగ్యమే మహా భాగ్యం అన్నారు పెద్దలు. ఆరోగ్యానికి మించిన సంపద ఏదీ లేదు. మనం ఆరోగ్యంగా ఉంటేనే మనం అనుకున్నది సాధిస్తాం..మన గమ్యం చేరుకుంటాం. మనవాళ్లతో ఆనందంగా గడుపగలం. అయితే చాలామంది వారి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. ఏదీ పడితే అది తింటుంటారు. వ్యాయామం చేయరు.. మందు, గుట్కాలు, జంక్ ఫుడ్ తింటారు. ఇలా ఆరోగ్యంగా ఉండడాని కంటే అనారోగ్యం బారిన పడే వాటికే మనం ఎక్కువగా మొగ్గు చూపుతుంటాం. సడెన్ గా ఏదైనా అనారోగ్యానికి గురికాగానే డాక్టర్ల దగ్గరకు పరుగెత్తుకుంటూ వెళ్తాం.
మనం ఆరోగ్యంగా ఉన్నామా? లేదా? అనేది ఈ చిన్న టెస్ట్ ద్వారా తెలుసుకుందాం. ఓ చిన్న వీడియో మీకోసం అందించాం. దాన్ని చూసి మీకు మీరే ఒక టెస్ట్ పెట్టుకోండి. ఆ వీడియోను ఫాలో అవుతూ చెప్పింది చేయండి. మీ ఆరోగ్యం మీకే తెలుస్తుంది.
ఈ వీడియో ప్రకారం.. వీడియోలో 7 బాక్సులు ఉంటాయి..సుదీర్ఘ శ్వాస ద్వారా మీరు ఆ బాక్సులను క్రాస్ చేసుకుంటూ వెళ్తే మీరెంత ఆరోగ్యంగా ఉన్నారో మీకే తెలుస్తుంది. నౌ రెడీ..మీరు గట్టిగా లంగ్స్ నిండుగా సుదీర్ఘ శ్వాసను తీసుకోండి. ఆ శ్వాసను మీరు ఎంత సేపు ఆపుతారో అనే దానిపై మీ ఆరోగ్యం ముడిపడి ఉంటుంది. మీరు మీ శ్వాసను మూడు బాక్సులు క్రాస్ చేయలేదంటే మీరు అనారోగ్యంగా ఉన్నట్టే. మీరు వెంటనే డాక్టర్ ను సంప్రదించాల్సిందే.
ఇక నాలుగు బాక్స్ లను క్రాస్ చేయగలిగితే మీ హెల్త్ యావరేజ్ గా ఉన్నట్లు అర్థం. ఐదు బాక్సులను దాటగలిగితే మీరు ఆరోగ్యంగా ఉన్నట్లు. ఎవరైతే ఏడు బాక్సులను క్రాస్ చేసేంత వరకు ఊపిరిని ఆపగలరో వారు సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నట్లే.
ఇది శాస్త్రీయంగా నిరూపితమైన పద్ధతే. ఎందుకంటే మనిషి ఆరోగ్యం, జీవితం శ్వాసపైనే ఆధారపడి ఉంటుంది. అందుకే ప్రాణాయామ, యోగ, ధ్యానం చేస్తుంటారు. శ్వాసను నిలిపి ఉంచడం ద్వారా ఆరోగ్యం మెరుగుపడుతుంది. క్రమబద్ధంగా ఉఛ్వాస, నిఛ్వాసలను చేస్తుంటారో వారే ఎక్కువ కాలం బతుకుతారని ప్రకృతి వాదులు చెబుతుంటారు.