JAISW News Telugu

Monkeypox : మంకీపాక్స్ పై కేంద్రం అప్రమత్తం.. ఎయిర్ పోర్టుల్లో అలర్ట్

Monkeypox

Monkeypox

monkeypox : విదేశాల్లో మంకీపాక్స్ వేగంగా పెరుగుతుండడంతో పాటు పాకిస్థాన్ లో పలువురికి వైరస్ సోకడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎయిర్ పోర్టులు, దేశ సరిహద్దుల వద్ద అలర్ట్ ప్రకటించింది. వైరస్ మన దేశంలోకి ప్రవేశించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచిస్తూ మార్గదర్శకాలు విడుదల చేసింది. విదేశాల నుంచి వచ్చేవారిలో ఎంపాక్స్ లక్షణాలు కనిపిస్తే వెంటనే క్వారంటైన్ చేయాలని పేర్కొంది. ఈ మేరకు ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్, సఫ్దర్ జంగ్ హాస్పిటల్, లేడీ హార్దింగ్ హాస్పిటల్ లో మంకీపాక్స్ బాధితుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపింది. అదే విధంగా వైరస్ నిర్ధారణ కోసం దేశవ్యాప్తంగా 32 ల్యాబ్ లలో అవసరమైన సదుపాయాలను అందుబాటులో ఉంచినట్లు తెలిపింది.

2022 నుంచి ఇప్పటి వరకు మన దేశంలో 30 మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. అయితే, తాజాగా విదేశాలలో విస్తరిస్తున్న వేరియంట్ కేసులు మాత్రం ఇప్పటి వరకూ నమోదు కాలేదు. దీంతో అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలను కేంద్రం ఆదేశించింది. వైరస్ బాధితులను గుర్తించి చికిత్స కోసం అసుపత్రులలో ఏర్పాట్లు చేయాలని సూచించింది.

Exit mobile version