Benefits of Daily Walking:నడకే.. మనిషికి మహా ఔషధం!

Benefits of Daily Walking:ఈ ఉరుకులు, పరుగుల జీవితంలో కాస్త సమయం కేటాయించి నడక ప్రారంభిస్తే క్రమేణా అనారోగ్య సమస్యలు కూడా తగ్గిపోతాయి. ‘నడకే మనిషికి మంచి ఆరోగ్యం’ అని పెద్దలు అంటుంటారు. వ్యాయామం చేసినా, ఆటలు ఆడినా, నడక నడిచినా, పరుగెత్తినా ఎంతోకొంత ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. అయితే ఇది క్రమం తప్పకుండా ప్రతిరోజూ ఉదయమో, సాయంత్రమో జరగాల్సివుంది. తర్వాత శరీరంలో ఉండే కొవ్వు, ఇతర వ్యర్థాలు కొంతమేరకు చెమట రూపంలో పోతాయి. తద్వారా శరీరం దృఢంగానూ, ఆరోగ్యం మెరుగ్గానూ మారుతుంది.

ఎక్సర్‌సైజుల్లో నడకను మించిన తేలికపాటి వ్యాయామం మరొకటి లేదు. ఏ వయస్సు వారైనా ఎప్పుడైనా ఎక్కడైనా నడకను కొనసాగించొచ్చు. దీనికోసం పైసా ఖర్చు పెట్టనక్కరలేదు. మిగతా వ్యాయామాల కన్నా సురక్షితం కూడా. నడక వల్ల బరువు తగ్గటంతోపాటు ఎన్నో ఉపయోగాలు, మరెన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ప్రతిరోజూ నడవటం వల్ల శరీరంలో ఉండే ఎండార్ఫిన్లు అనే హార్మోన్లు విడుదలవుతాయి. ఇవి మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్‌, కంగారు వంటి సమస్యలు తగ్గుతాయి. వయస్సు మీద పడటం వల్ల వచ్చే డెమన్షియా, అల్జీమర్స్‌ వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. కంటికి సంబంధించిన పలు నాడులు కాళ్లలో ఉంటాయి. అందుకనే కాళ్లతో నడవటం వల్ల కంటి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. నడవటం వల్ల శరీరం ఆక్సిజన్‌ను ఎక్కువగా గ్రహిస్తుంది. అదే ఆక్సిజన్‌ రక్తంలో చేరి ఊపిరితిత్తులకు చేరి శరీరం ఆక్సిజన్‌ను గ్రహిస్తుంది. ఆక్సిజన్‌ ఊపిరితిత్తుల్లో ఉండే టాక్సిన్లు, విష, వ్యర్థ పదార్థాలను బయటకు పంపుతుంది. ఇతర ఊపిరితిత్తుల సమస్యలు కూడా దూరమవుతాయి.

TAGS