JAISW News Telugu

Benefits of hugging : కౌగిలింతలో ఇన్ని ప్రయోజనాలున్నాయా? అవేంటో ఒకసారి చూడండి

benefits of hugging

benefits of hugging

benefits of hugging : హగ్ చేసుకోవడం ద్వారా అనేక ప్రయోజనాలు పొందవచ్చునని వైద్య నిపుణులు చెబుతున్నారు. కౌగిలింత శరీరానికి ఎంతో అవసరమని ఒక్కో సందర్భంలో ఒక్కోలా ఇది ఎంతో మేలు చేస్తుందని పేర్కొంటున్నారు. మనసుకు ధైర్యం, ఆత్మ విశ్వాసం, మెదడుకు ఉత్సాహం, గుండెకు ఎంతో మేలు ఈ కౌగిలింతలో దొరుకుతుందని అభిప్రాయపడుతున్నారు. మనలో కొందరు కోపం వచ్చినప్పుడో, చిరాకుగా ఉన్నప్పుడో, మంచి మూడ్ లో ఉన్నప్పుడో తమకు నచ్చిన వారిని కౌగిలించుకుంటారు. దీని ద్వారా ఎంతో ఉపశమనం లభిస్తుందనేది ఎవరూ కాదనలేని సత్యం.

ఇది ఎంతో సాధారణమైన ప్రక్రియే అయినా, శరీరానికి, మనసుకు ఎన్నో లాభాలు ఉంటాయి. శరీరంలోని అనేక భాగాలను ఉత్తేజపరచడంలో ఈ హగ్ ఉపయోగపడుతుంది. ఆరోగ్యపరంగా ఎంతో మేలు చేస్తుంది.  సంతోషాన్ని తెలియజేసే ఎండోర్ఫిన్ హర్మోన్లు ఈ హగ్ ద్వారా విడుదలవుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఒత్తిడి, బాధ నుంచి విముక్తికి హగ్ అనేది ఎంతో మేలు చేస్తుంది. ప్రేమ, స్నేహం, మద్దతు తెలిపేందుకు ఈ కౌగిలింత ఎంతో మేలు చేస్తుంది. ఇతరులకు మన భావాన్ని చెప్పలనుకున్నప్పుడు ఈ హగ్ ఉపయోగపడుతుంది,

ఆందోళనను తగ్గించి, మనశ్శాంతిని పెంచడంలో ఉపయోగపడే ఆక్సిటోసిన్ హర్మోన్ విడుదలలో ఈ కౌగిలింత ఎంతో ఉత్తేజపరుస్తుంది. టెన్షన్ పోగొట్టడంతో పాటు అధిక రక్తపోటు నుంచి ఉపశమనానికి ఇది ఎంతో మేలు చేస్తుంది. దీంతో పాటు సోషల్ రిలేషన్ షిప్ పెరుగుదలకు దోహదం చేస్తుంది. ముఖ్యంగా మానసిక ఒత్తిడి తగ్గిస్తుంది. హగ్ అనంతరం మన బాడీలో అనుకూల మార్పులు కనిపిస్తుంటాయి. అందుకే రోజులో ఒకసారైనా మనకు ఇష్టమైన వారిని హగ్ చేసుకుంటే శరీరానికి, మనసుకు ఎంతో మేలు చేసిన వారం అవుతాం అంటున్నారు వైద్యనిపుణులు.

మానసికంగా ధృఢంగా ఉండేందుకు ఈ కౌగిలింత ఎంతో మేలు చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎమోషనల్ గా ఫీలైనప్పుడు మీకు ఇష్టమైన వారిని ఒకసారి హగ్ చేసుకొని చూడండి. . ఎంతటి రిలీఫ్ మీ మనసుకు సొంతమవుతుందో తెలుసుకుంటారు. హగ్ తో కలిగే ఆరోగ్యకర ప్రయోజనాలను మీరు కూడా పొందండి.

Exit mobile version