Zomato : ఆహార వృధాను తగ్గించడానికి ‘ఫుడ్ రెస్క్యూ’ ఫీచర్‌ను ప్రారంభించిన జొమాటో

Zomato

Zomato

Zomato : ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ జొమాటో ఆదివారం ‘ఫుడ్ రెస్క్యూ’ అనే కొత్త ఫీచర్‌ను ప్రారంభించింది. కస్టమర్లు వివిధ కారణాల వల్ల ప్లాట్‌ఫారమ్‌లో ప్రతి నెలా నాలుగు లక్షల కంటే ఎక్కువ ఆర్డర్‌లను రద్దు చేస్తారు. ఈ ఫీచర్ ప్రకారం కస్టమర్లు క్యాన్సిల్ చేసిన ఆర్డర్లను డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంటుంది. జొమాటో సహ వ్యవస్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ దీపిందర్ గోయల్ ఈ విషయాన్ని ప్రకటించారు. ‘ఇప్పుడు రద్దు చేసిన ఆర్డర్లు సమీప వినియోగదారులకు వస్తాయి. వారు వాటిని తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. నిమిషాల్లో వాటిని అందుకోవచ్చు.’ అని చెప్పారు. అయితే మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. ఈ సర్వీసును మెరుగుపరచాలని సూచించిన వినియోగదారుడికి గోయల్ ఉద్యోగం కూడా ఇచ్చారు.

నో-రిఫండ్ విధానం ఉన్నప్పటికీ వివిధ కారణాల వల్ల నెలకు 4,00,000 కంటే ఎక్కువ ఆర్డర్లను వినియోగదారులు క్యాన్సిల్ చేస్తున్నారని గోయల్ చెప్పారు. క్యాన్సిల్ చేసిన ఆర్డర్లు డెలివరీ పార్టనర్‌కు 3 కిలోమీటర్ల పరిధిలో నివసించే కస్టమర్లకు కనిపిస్తాయి. క్లెయిమ్ చేసుకునే ఆప్షన్ కొన్ని నిమిషాలు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఐస్ క్రీం, షేక్స్, స్మూతీలు, మరికొన్ని ఫుడ్ రెస్క్యూ లిస్టులో ఉండవని కూడా గోయల్ తెలిపారు.

TAGS