Yuvraj Singh : యువరాజ్‌ సింగ్‌ విన్నింగ్‌ సెలబ్రేషన్స్‌.. పాకిస్థాన్‌పై సెటైరికల్‌ వీడియో.. వైరల్

Yuvraj Singh : యువరాజ్ సింగ్ సారధ్యంలో ‘వరల్డ్ ఛాంపియన్ సిప్ ఆఫ్ లెజెండ్స్-2024’ ట్రోఫీని టీమిండియా జట్టు గెలుచుకుంది. దాయాది దేశం పాకిస్తాన్ తో శనివారం రాత్రి జరిగిన చివరి మ్యాచ్ లో టీమిండియా అద్భుతమైన ప్రదర్శన కనబర్చింది. దీంతో పాక్ చిత్తుగా ఓడిపోయింది. ఈ విజయం తర్వాత
యువరాజ్‌, హర్భజన్‌, సురేష్‌ రైనా.. వెరైటీ సెలబ్రేషన్స్‌ చేసుకున్నారు. ఈ సెలబ్రేషన్స్ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. సెలబ్రేషన్స్‌కు అర్థం తెలియకపోయినా.. పాక్ పై సెటైరికల్‌గానే ఆ వీడియో చేసినట్లు క్రికెట్‌ అభిమానులు చెప్పుకుంటున్నారు.

ఫైనల్‌ మ్యాచ్‌ తర్వాత.. గ్రౌండ్‌లో సెలబ్రేషన్స్‌ ముగించుకొని.. డ్రెస్సింగ్‌ రూములోకి తిరిగి వచ్చే క్రమంలో యువరాజ్‌ సింగ్‌, సురేష్‌ రైనా, హర్భజన్‌ సింగ్‌.. దెబ్బలు తగిలిన వారిలా, వృద్ధులుగా డోర్‌ తీసుకొని లోపలికి వచ్చారు. ఈ వీడియోను చూసిన క్రికెట్‌ ఫ్యాన్స్ సరదాగా నవ్వుకుంటున్నారు. అయితే.. ఈ సెలబ్రేషన్స్‌ పాక్ ఫాస్ట్‌ బౌలర్లపై సెటైర్ గా చేసిందా? అని కొందరు నెటిజన్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఎందుకంటే.. ప్రతి 2 నెలలకు గాయపడుతూ ఆటకు దూరం అవుతూ.. ఫిట్‌నెస్‌ లేని వారిపై భారత సీనియర్లు సెటైర్‌ వేసినట్లు తెలుస్తోంది. అలాగే టీ20 వరల్డ్‌ కప్‌-2024 గెలిచి.. టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ కప్పు అందుకున్నాడు. దాన్ని కూడా ఇమిటేట్‌ చేసి ఫన్‌ జనరేట్‌ చేశారా..? అని కూడా ఫ్యాన్స్ ఆలోచిస్తున్నారు. ఏది ఏమైనా.. యువీ, రైనా, భజ్జీ చేసిన సెలబ్రేషన్స్‌ మామూలుగా లేవని కామెంట్లు వస్తున్నాయి.

ఇక ‘వరల్డ్ ఛాంపియన్ సిప్ ఆఫ్ లెజెండ్స్-2024’ ట్రోఫీ మ్యాచ్ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో ఫస్ట్ బ్యాటింగ్‌ చేసిన పాక్ జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 156 పరుగులు చేసింది. షోయబ్‌ మాలిక్‌ 41, కమ్రాన్‌ అక్మల్‌ 24, తన్వీర్‌ 19 చేసి స్కోర్ బోర్డును ముందుకు తీసుకెళ్లారు. భారత బౌలర్లలో అనురీత్‌ సింగ్‌ 3 వికెట్లు తీసి సత్తా చాటాడు. నేగి, ఇర్ఫాన్‌ పఠాన్‌ చెరో వికెట్‌ తీసుకున్నారు.

తర్వాత ఛేజింగ్‌కు దిగిన ఇండియా టీమ్ 19.1 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసి.. ఛాంపియన్స్‌ ఆఫ్‌ లెజెండ్స్‌గా నిలిచింది. అంబటి రాయుడు 50, గుర్‌క్రీత్‌ సింగ్‌ 34, యూసుఫ్‌ పఠాన్‌ 30 రన్స్ చేసి విజయానికి దోహదపడ్డారు.

TAGS