JAISW News Telugu

YSRCP : వైకాపా డబుల్ గేమ్: వక్ఫ్ బిల్లు ఓటింగ్‌లో మతలబు + ఫోర్జరీ విప్ డ్రామా

YSRCP : వక్ఫ్ బిల్లుకు అనుకూలంగా వైకాపా సభ్యుల ఓట్లు పడేలా చేయడంలో వైవీ సుబ్బారెడ్డి (బాబాయి) విజయం సాధించారు. అయితే, ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాలు వైకాపా డబుల్ గేమ్‌ను బయటపెట్టాయని విమర్శకులు అంటున్నారు.

నిన్న రాత్రి వైకాపా విప్ జారీ చేయలేదనే వార్తలు జాతీయ మీడియాలో పెద్ద దుమారానికి దారితీశాయి. క్రాస్ ఓటింగ్ జరిగిందని పలువురు అనుమానించారు. వివేకానంద రెడ్డి హత్య జరిగిన సమయంలోనే రాజ్యసభలో వక్ఫ్ బిల్లుకు అనుకూలంగా ఓటు వేస్తే ఎవరికీ తెలియదని వైకాపా భావించిందని ఆరోపణలు వెల్లువెత్తాయి.

కానీ, రాజ్యసభలో పార్టీల బలాబలాలు, హాజరైన, హాజరుకాని సభ్యుల వివరాలు, జారీ చేసిన విప్‌లు, ఓటింగ్ సరళిని జాతీయ మీడియా క్షుణ్ణంగా పరిశీలించింది. ఎన్డీయే, కాంగ్రెస్ పార్టీలు తమ సభ్యులకు విప్ జారీ చేసినప్పటికీ, వైకాపా మాత్రం ఎలాంటి విప్ జారీ చేయకుండానే వక్ఫ్ బిల్లుకు అనుకూలంగా ఓటు వేయడం ద్వారా ముస్లింలకు వెన్నుపోటు పొడిచిందని తేల్చింది. దీంతో వైకాపాను బ్లాక్‌షీట్ పార్టీగా అభివర్ణిస్తున్నారు.

ఈ పరిణామాలతో ఉలిక్కిపడ్డ వైకాపా, మధ్యాహ్నం నిద్రలేచి హడావుడిగా దిద్దుబాటు చర్యలకు దిగింది. మొదట బాబాయిని బలిపశువును చేయాలని భావించినప్పటికీ, చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా తమ సోషల్ మీడియా టీమ్‌కు నకిలీ విప్‌ను సృష్టించే పని అప్పగించింది. బాబాయి సంతకాన్ని ఫోర్జరీ చేసి అతికించినా సరిపోయేదని వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తున్నారు. ఈ ఘటన వైకాపా విశ్వసనీయతను ప్రశ్నార్థకం చేసిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Exit mobile version