YSRCP : ఓటరు అంచనాను అందుకోని వైసీపీ..

YSRCP

YSRCP

YSRCP : ఈ సారి (2024) ఎన్నికల్లో వైసీపీ డబ్బుల పండగ చేస్తుందని ఓటర్లు ముఖ్యంగా వైసీపీకి ఓటర్లు బలమైన నమ్మకంతో ఉన్నారు. ఓటర్లకు పంచేందుకు పార్టీ సెకండ్ కేటగిరీ నాయకులకు రూ. లక్షలు ఇచ్చారన్న ప్రచారంతో తమ ఓటుకు రూ. వేలల్లో ఇస్తారన్న గట్టి నమ్మకంతో ఓటర్లు ఉన్నారు. కానీ వైసీపీ నేతలు ఈ అంచనాలు అందుకోవడంలో విఫలయ్యారని తెలుస్తోంది. ఓటుకు రూ. వెయ్యి మాత్రమే అది కూడా చాలా తక్కువ మందికి పంపిణీ చేసినట్లు తెలుస్తోంది.

టీడీపీకి ఓటు వేస్తారు అని అనుమానం ఉన్న వారికి రూ. వెయ్యి కూడా ఇవ్వలేదు. వైసీపీ ఓటర్లకు కూడా పూర్తి స్థాయిలో పంపిణీ చేయకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఐదేళ్లు ఇష్టారీతిన సంపాదించుకున్నారని ఓట్ల సమయంలో ఎంతో కొంత ఇవ్వలేరా? అన్న అసంతృప్తి ఓటర్లలో ఎక్కువగా కనిపిస్తోంది. వైసీపీ ఓటు బ్యాంకు ఎక్కువగా ఆ పార్టీ నేతలు ఇచ్చే నోట్లపైనే ఆధార పడి ఉంది. అయితే డబ్బులు ఇవ్వకున్నా తమకే ఓటేస్తారన్న నమ్మకంతో  ఎక్కువ మంది నేతలు డబ్బులు పంచేందుకు ఇష్టపడలేదు.

నోట్లు పంచేందుకు ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేసుకున్నప్పటికీ సెకండ్ క్యాడర్ నేతలు చాలా వరకు తమకు అందిన డబ్బును తమ వద్దే ఉంచుకునేందుకు ప్రయత్నించారు. ఇది కూడా ఆ పార్టీ అంచనాను అందుకోలేకపోవడానికి ఓ కారణంగా తెలుస్తోంది. ఓ పనిని సక్రమంగా పూర్తి చేయలేని చేతకానితనం వైసీపీకి.. ఎలక్షన్ ఇంజినీరింగ్ లోనూ కనిపించింది. పార్టీ క్యాడర్ ను నిర్లక్ష్యం చేసి వలంటీర్లకు ప్రాధాన్యం కల్పించడంతో మొదటికే మోసం వచ్చిందన్న అభిప్రాయం వినిపిస్తోంది.

TAGS