Sunitha : తెగించే వచ్చా..నన్ను నరికేస్తారా..షర్మిలమ్మను నరికేస్తారా: సునీతా సంచలన వ్యాఖ్యలు

Sunitha : ఏపీలో ఎన్నికల ప్రచారం ముగిసింది. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో కెల్లా కడప ఎంపీ స్థానంలో ఎవరు గెలుస్తారో అనేదానిపైనే అత్యంత ఉత్కంఠ నెలకొంది. ఈ స్థానం నుంచే వైసీపీ అభ్యర్థిగా అవినాశ్ రెడ్డి, వైఎస్ షర్మిల పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. వివేకానందరెడ్డి హత్య కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న అవినాశ్ రెడ్డికి ఓటు వేయవద్దని షర్మిల, వివేకా కూతురు సునీతారెడ్డి పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే.

కాగా తనకు ఏమైనా జరుగవచ్చని.. అన్నింటికీ తెగించే వచ్చా అని నిన్న ఓ ప్రెస్ మీట్ లో వైఎస్ సునీతా రెడ్డి ఎమోషనల్ అయ్యారు. తన తండ్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వైఎస్ అవినాశ్ రెడ్డిని ఎలాగైనా కడప ఎంపీగా ఓడించి వైఎస్ షర్మిళను గెలిపించాలని సునీతా కృషి చేస్తున్నారు. ఈనేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో జగన్ రెడ్డి మాట్లాడుతూ.. అసలు తప్పే చేయనటువంటి అవినాశ్ రెడ్డిపై ఎందుకు ఆరోపణలు చేస్తున్నారో తెలియడం లేదని..ఈ కేసు కోర్టులో ఉన్నందున తాను ఏమీ మాట్లాడలేనని అన్నారు. దీనిపై సునీతా రెడ్డి స్పందించారు.

కేసు ఇంకా కోర్టులో ఉన్నప్పుడు మీరు ముఖ్యమంత్రి అయ్యాక అసెంబ్లీలో అవినాశ్ రెడ్డి చంపలేదు అని ఎలా చెప్పగలిగారు? మొన్న ప్రచారంలో అవినాశ్ అమాయకుడు అని క్లీన్ చీట్ ఎలా ఇచ్చారు? నేను పగ తీర్చుకోవాలనుకుంటే నా తండ్రిని చంపినవాడిని నేనే నరికేదాన్ని. నాకు కావాల్సింది పగతీరడం కాదు. సమాజంలో లా అండ్ ఆర్డర్ బాగుండాలి. ఇలా చంపేసి చట్టాన్ని గుప్పిట్లో పెట్టుకుంటానంటే కుదరదు.

పులివెందులలో సింగిల్ ప్లేయర్ ఉండాలనే వివేకానందరెడ్డిని హత్య చేశారు. నేనైతే నా వీలునామా రాసేశాను నా పిల్లలకి. అన్నింటికీ తెగించే వచ్చాను.. భారతీ గారు నన్ను నరికేస్తారా.. షర్మిలమ్మను నరకేస్తారా నాకు తెలియదు. సింగిల్ ప్లేయర్ ఉండాలంటే అదొక్కటే పాజిబిలిటీ అంటూ తీవ్ర భావోద్వేగం చెందారు.

TAGS