YS Vijayamma : విజయమ్మ సందిగ్ధం? కొడుకా? కూతురా?
YS Vijayamma : ఆంధ్రప్రదేశ్ లో కుటుంబ రాజకీయాలు నడుస్తున్నాయి. జగన్ కుటుంబం సరికొత్త తీరుతో రాజకీయాలు చేస్తోంది. ఇన్నాళ్లు జగన్ తల్లి విజయమ్మ కూతురు షర్మిలతోనే ఉందని అనుకుంటున్న తరుణంలో ఇడుపులపాయలో ఎన్నికల ప్రచారం నిర్వహించే ముందు చేసిన ప్రార్థనలో తల్లి విజయమ్మ పాల్గొంది. దీంతో అందరిలో అనుమానాలు రేకెత్తుతున్నాయి. విజయమ్మ ఎటు వైపు ఉందనే వాదనలు వస్తున్నాయి.
విజయమ్మ కుమార్తె షర్మిలకే మద్దతుగా ఉంటుందని భావించారు. ఇప్పుడు కొడుకుతో కలిసి ఉండడంతో ఆమె సపోర్ట్ ఎవరికి ఉంటుందనే ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. ఈనేపథ్యంలో విజయమ్మ ఎవరివైపు ఉందని అనుకుంటున్నారు. తన కుమార్తె వైపు ఉండటానికే వైసీపీ గౌరవాధ్యక్షురాలికి రాజీనామా చేశానని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సీన్ రివర్స్ కావడంతో విజయమ్మ మదిలో ఏముందో తెలియడం లేదు.
బాబాయ్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడైన అవినాష్ రెడ్డికి కడప టికెట్ కేటాయించడం అనేక సందేహాలకు తావిస్తోంది. దీంతో సునీత కుటుంబానికి తాను అండగా ఉంటానని షర్మిల చెబుతోంది. తన బాబాయ్ ఆశయం తాను ఎంపీగా కావడమేనని చెబుతున్నారు. అవినాష్ రెడ్డికి జగన్ అండగా ఉండటంతో తాను సునీత కుటుంబానికి అండగా నిలుస్తామని చెబుతున్నారు.
ప్రస్తుతం కుమారుడితో మాటలు లేకున్నా విజయమ్మ కొడుకు వెంట నిలవడం అనుమానాలకు బీజం వేస్తోంది. విజయమ్మను తనతో ఉంచుకుని సెంటిమెంట్ ను ప్రయోగిస్తున్నారు. తల్లిని తనతో ఉండాలని జగన్ తెచ్చిన ఒత్తిడి వల్లే విజయమ్మ అతడితో కనిపించిందంటున్నారు. ఈ పరిస్థితుల్లో కుమార్తెకు మద్దతుగా నిలుస్తానని చెప్పలేకపోతున్నారు. విజయమ్మ ఒత్తిడికి గురవుతున్నారు.
ఈ పరిస్థితుల్లో విజయమ్మ అడకత్తెరలో చిక్కుకున్న పోక చెక్కలా మారిపోయింది. ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్లు అటు కూతురు ఇటు కొడుకు తనకు రెండు కండ్లు అని గతంలో చెప్పడంతో ఎటు తేల్చుకోలేకపోతున్నారు. కూతురు వైపా కొడుకు వైపా అనేది తెలియడం లేదు. ప్రస్తుత రాజకీయాల పరిస్థితిలో విజయమ్మ గమ్యం ఎటు వైపు అనే వాదనలు కూడా వస్తున్నాయి.