YS Sunitha : కడప ఎస్పీని కలిసిన వైఎస్ సునీత
YS Sunitha : కడప ఎస్పీ విద్యాసాగర్ ను వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీత శుక్రవారం కలిశారు. వివేకా హత్య కేసు గురించి ఎస్పీకి వివరించారు. వివేకా హంతకులకు శిక్ష పడేలా పోలీసులు కూడా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీంద్రారెడ్డి అభ్యంతరకర పోస్టులపైనా సునీత ఎస్పీతో చర్చించారు. అనంతరం ఆమె హైదరాబాద్ వెళ్లారు.
గత ఆగస్టులో కడప ఎస్పీగా ఉన్న హర్షవర్ధన్ రాజును కూడా సునీత కలిశారు. మొదట హోంమంత్రి అనితను కలిసిన అనంతరం అప్పటి ఎస్పీ హర్షవర్ధన్ రాజును కలిసి తండ్రి హత్య అంశంపై మాట్లాడారు. కాగా, హోం మంత్రి అనితను కలిసిన సమయంలో వివేకా హంతకులకు స్థానిక పోలీసుల అండ లభిస్తోందని సునీత ఆవేదన వెలిబుచ్చారు. సీబీఐ విచారణకు పోలీసులు సహకరించేలా చూడాలని ఆమె విజ్ఞప్తి చేశారు.