JAISW News Telugu

Raja Reddy Marriage : వైఎస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి వివాహం

FacebookXLinkedinWhatsapp
Raja Reddy Marriage

Raja Reddy Marriage

Raja Reddy Marriage : ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తనయుడు రాజారెడ్డి వివాహం (ఫిబ్రవరి 17) ఘనంగా జరిగింది. అమెరికాలో మాస్టర్స్ పూర్తి చేసి ఓ ఐటీ కంపెనీలో విధులు నిర్వర్తిస్తున్న ప్రియా అట్లూరిని రాజారెడ్డి వివాహం చేసుకుంటున్నాడన్న విషయం తెలిసిందే.

రాజస్థాన్ లోని జోధ్ పూర్ ఉమేద్ ప్యాలెస్ లో జరిగిన ఈ వివాహ వేడుకలో కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులు పాల్గొన్నారు.

హల్దీ ఈవెంట్ లో ఈ జంటకు సంబంధించిన ఫొటోలు బయటకు వచ్చాయి. ఒక ప్రముఖ సెలబ్రిటీ ఫొటో గ్రాఫర్ జోసెఫ్ రాధిక్ ఇప్పటికే కొన్ని అందమైన క్షణాలను బంధించారు. హల్దీ కార్యక్రమానికి షర్మిల, విజయమ్మతో సహా మిగిలిన కుటుంబ సభ్యులు పసుపు రంగు దుస్తులు ధరించారు.

నిశ్చితార్థ వేడుక జనవరిలో జరిగింది. మూడు రోజులుగా వివాహ వేడుకలు జరుగుతున్నాయి. 16వ తేదీ నుంచి 18వ తేదీ వరకు వేడుకలు నిర్వహిస్తున్నట్లు షర్మిల తెలిపారు. ఇందులో భాగంగా 16వ తేదీన సంగీత్, మెహందీ జరిగింది. శనివారం సాయంత్రం 5.50 గంటలకు రాజారెడ్డి-ప్రియ బంధుమిత్రుల సాక్షిగా ఒక్కటయ్యారు. వివాహానికి సంబంధించిన ఫొటోలు షర్మిల సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేశారు. దీంతో ఇవి కాస్తా వైరల్ గా మారాయి. పెళ్లి ఫొటోలను పోస్ట్ చేయలేదు కానీ, హల్దీ ఫొటోలు మాత్రం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

వైట్ అండ్ వైట్ డ్రెస్‌లో వధూవరులు ముస్తాబు కాగా.. బంధువులు అందరూ పసుపు దుస్తుల్లో కనిపించారు. రాజారెడ్డి-ప్రియ ఇరుకుటుంబాలు కనిపించారు. షర్మిల, ఆమె భర్త బ్రదర్ అనిల్ కుమార్, కూతురు అంజలి, తల్లి విజయమ్మ వధూవరుల పక్కన ఉండగా.. ప్రియ తల్లిదండ్రులు, ఆమె సోదరుడు మరోపక్క నిలబడి ఫొటోలో కనిపించారు.

Exit mobile version