YS Sharmila : వైఎస్ జగన్ కు వ్యతిరేకంగా వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరి కడప నుంచి ఎంపీ పోటీ చేస్తుంది. జగన్ అన్న జైల్లో ఉన్నప్పుడు పార్టీకి అండగా నిలబడింది నేను కాదా? పార్టీ నడిపించింది నేనే కదా.. అలాంటప్పుడు నాకు పదవి వ్యామోహం ఉంటే నేను ఎప్పుడో నీ స్థానంలో ఉండేదాన్ని అని నాకు పదవి వ్యామోహాలు లేవని షర్మిల అన్న జగన్ పై మండిపడింది.
నీ పార్టీని కాపాడటానికి నేను ఎంతో కృషి చేశాను. కాళ్లకు బలపం కట్టుకుని తిరిగాను.. కాలు నొప్పి పెడుతున్న పంటి బిగువన భరించి ప్రచారం చేశాను. పాదయాత్రను కంటిన్యూ చేసి నీ పార్టీని కాపాడాను. ఇప్పుడు నువ్వు నన్ను నీ పార్టీ నాయకులతో తిట్టిస్తున్నావా.. అంటూ కంటతడి పెట్టుకుంది.
నేను చేసిన తప్పేంటి.. నన్ను మీ పార్టీ వాళ్లతో తిట్టిస్తున్నారు. నేను కాంట్రాక్టు అడిగితే ఇవ్వలేదని అందుకే జగన్ కు వ్యతిరేకంగా పని చేస్తున్నానని విమర్శలు చేస్తున్నారు. వైసీపీ సోషల్ మీడియా లో తన వ్యక్తిత్వంపై దారుణమైన ట్రోల్స్ చేయిస్తున్నారని మండిపడ్డారు.
పేద ప్రజలకు న్యాయం చేసేందుకే తనకు, తల్లికి పదవి ఇవ్వలేదని కుటుంబ సభ్యుల్లో ఎవరికి పదవి ఉండరాదని చెబుతూ ఓట్ల నాటకమాడుతున్నారని ఆరోపించారు. కావాలనే తన పై బురద చల్లేందుకు వచ్చిందని ఆరోపిస్తున్న జగన్ విధానం సరైంది కాదని ఆమె అన్నారు. తనకు రాజ్యసభ సీటు ఇస్తానని తల్లిని కూడా ఎంపీ గా చేస్తానని చెప్పి జగన్ మోసం చేశాడని ఆరోపించారు. అసలు అలాంటి పదవులే కావాలనుకుంటే 16 నెలలు జగన్ జైల్లో ఉన్నపుడు పార్టీని కూడా సొంతం చేసుకుని ఉండొచ్చు కదా.. షర్మిల వైఎస్ రాజశేఖర్ రెడ్డి బిడ్డ. కానీ జగన్ లాగా ముందొకటి వెనకొకటి మాట్లాడదు అంటూ కౌంటర్ ఇచ్చారు. ఆడబిడ్డ అని చూడకుండా నాపై చేస్తున్న అసత్య ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నానని జగన్ నిజస్వరూపాన్ని బయటపెట్టింది. దీనిపై వైసీపీ నాయకులు ఎలాంటి కౌంటర్ ఇస్తారో చూడాలి.