YS Sharmila : షర్మిల దెబ్బ.. వైఎస్  జగన్ అబ్బా.. ఇంత భయమా..?

YS Sharmila

YS Sharmila and CM Jagan

YS Sharmila :  వైఎస్ షర్మిల.. సొంత సోదరి అంటే వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ రెడ్డి వణికిపోతున్నారా..? ఏపీ రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నారనే వార్తలతోనే జంకుతున్నారా..? త్వరలో ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండటంతో ముచ్చెమటలతో మునుగుతున్న జగన్‌కు షర్మిల పెద్ద తలనొప్పిగా మారారా..? అంటే ఇవన్నీ అక్షరాలా నిజమేనని స్వయానా వైఎస్ జగన్ రెడ్డే ఒప్పేసుకున్నారు. ఇందులో నిజమెంత..? ఇంతకీ జగన్ మాట్లాడిందేంటి..? ఆ కామెంట్స్‌కు ఎవరి నుంచి ఎలాంటి రియాక్షన్స్ వచ్చాయనే ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం..

అవును నిజమే..!

కాకినాడలో వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక పెంపు కార్యక్రమాన్ని వైఎస్ జగన్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా బహిరంగ సభలో జగన్ మాట్లాడుతూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయితే జగన్ ఏ ఉద్దేశంతో.. ఎవర్ని టార్గెట్ చేస్తూ మాట్లాడారో తెలియట్లేదు కానీ.. ఇప్పుడు ఆ కామెంట్స్ తన సోదరి షర్మిలను ఉద్దేశించి మాట్లాడినవేనని కొందరు అభిప్రాయపడుతున్నారు. ‘రాబోయే రోజుల్లో కుట్రలకు తెరతీస్తారు. పొత్తులు కూడా ఎక్కువగా పెట్టుకుంటారు. కుటుంబాలను చీల్చి రాజకీయాలు చేస్తారు. మీరందరూ (ప్రజలను ఉద్దేశించి) అప్రమత్తంగా ఉండాలి. మీ బిడ్డకు వాళ్ల మాదిరి అబద్ధాలు చెప్పడం రాదు. మీ బిడ్డ నమ్ముకున్నది పైన దేవుడు, ఇక్కడ ప్రజలనే’ అంటూ వైఎస్ జగన్ చెప్పుకొచ్చారు. అయితే.. షర్మిల ఏపీ రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నారనే జగన్ ఈ కామెంట్స్ చేశారని.. ఇవన్నీ సోదరిని ఉద్దేశించి చేసినవేనని టాక్ సోషల్ మీడియాలో గట్టిగానే నడుస్తోంది. అది కూడా సరిగ్గా షర్మిల తన ఇంటికి రావడానికి ముందే ఈ వ్యాఖ్యలు చేయడంతో ప్రాధాన్యత సంతరించుకుంది.

అబ్బే మాకేం సంబంధం..!

ఒకవేళ జగన్ చేసిన ఈ వ్యాఖ్యలు షర్మిలను ఉద్దేశించి చేసినవి కాకపోతే.. మరేంటి..? అని టీడీపీ అధినేత చంద్రబాబు, తెలుగు తమ్ముళ్లు ప్రశ్నిస్తున్నారు. స్వయంగా చంద్రబాబే మాట్లాడుతూ జగన్ వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇంట్లో చిచ్చు పెట్టుకున్న వైఎస్ జగన్ మాపై పడటమేంటి..?. జగనన్న వదిలిన బాణాన్నని అని అప్పుడు రాష్ట్రమంతటా తిరిగిన షర్మిల ఇప్పుడు రివర్స్‌లో తిరుగుతోంది. తల్లీ-చెల్లీ వ్యవహారాన్ని జగన్ తాను చూసుకోలేకపోతే మాకేంటి సంబంధం..?.  ఏదో రకంగా ఇతరులపై బురద చల్లేసి బతకటమూ ఓ రాజకీయమా..?. అయినా.. ఫించన్ల పెంపు అంటూ ప్రభుత్వ కార్యక్రమం పెట్టి, రాజకీయ పార్టీలను విమర్శిస్తాడా..?’ అంటూ జగన్‌ను చంద్రబాబు తిట్టిపోశారు.

జగన్ జంకుతున్నారా..?

వాస్తవానికి వైఎస్సార్టీపీ తెలంగాణలో పోటీచేయకపోవడం, ఆ తర్వాత కాంగ్రెస్‌లో విలీనం చేసి ఏపీ రాజకీయాల్లోకి షర్మిల వస్తున్నారని వార్తలు వచ్చినప్పటి నుంచే వైసీపీలో.. మరీ ముఖ్యంగా వైఎస్ జగన్‌లో వణుకు మొదలైందన్నది జగమెరిగిన సత్యమేనని కొందరు ఏపీ కాంగ్రెస్ నేతలు చెబుతున్న మాట. ఎందుకంటే ఇప్పుడు వైసీపీలో ఉన్న కార్యకర్తలు మొదలుకుని కీలక నేతల వరకూ అందరూ కాంగ్రెస్ నుంచి జగన్ పార్టీలోకి వచ్చారన్నది అందరికీ తెలుసు.

ఇప్పుడు షర్మిల పొరపాటున ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలైతే జగన్ పరిస్థితేంటన్నది ప్రశ్నార్థకంగా మారింది. అంతేకాదు.. ఇప్పటికే ఎమ్మెల్యేలు ఆళ్ల రామకృష్ణారెడ్డి, మల్లాది విష్ణు పలువురు సీనియర్, కీలక నేతలంతా షర్మిల వెంట నడుస్తామని దాదాపు ప్రకటించేశారు. ఇక షర్మిల ఏపీలో అడుగుపెట్టడం ఆలస్యం వైసీపీలో వికెట్లు టపీ టపీమని పడిపోతాయన్నది కొందరి విశ్లేషణ. దీంతో షర్మిల పేరెత్తితే చాలు జగన్ జంకుతున్నారట. మొత్తానికి చూస్తే.. షర్మిల దెబ్బకు జగన్ అబ్బా అంటున్నాడన్న మాట. మున్ముందు ఇంకా ఏం జరుగుతుందో చూడాలి మరి.

TAGS