YS Jagan : జగన్ నిజ స్వరూపం ఇదే..!
నేతలందరిలోనూ విజయసాయిరెడ్డి అత్యంత నీచమైన వ్యాఖ్యలు చేశారు. ‘చంద్రబాబును ఆకట్టుకునేందుకే షర్మిల పసుపు చీర కట్టుకొని వెళ్లారని’ ఆయన చాలా చౌకబారు వ్యాఖ్యలు చేశారు. ఈ అంశంపై విజయలక్ష్మి బహిరంగ లేఖ విడుదల చేసిన తర్వాత వైయస్సార్ కాంగ్రెస్ ఆమెను కూడా వదలకుండా మరో లేఖను విడుదల చేయడంతో పాటు ‘మోసపూరితంగా, కుట్రపూరితంగా’ వంటి అభ్యంతరకర పదాలను ఉపయోగించింది. ‘విచక్షణ కోల్పోయిన విజయమ్మ’ పేరుతో సాక్షి కథనాన్ని ప్రచురించింది.
ఆమె దివంగత వైయస్ కు సతీమణి అన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకొని సాక్షి గానీ, వైయస్సార్ కాంగ్రెసు గానీ సంయమనం పాటించలేదు. జగన్ అనుమతి లేకుండా ఇది జరిగి ఉంటుందని ఎవరూ అనుకోరు. ఈ వ్యవహారంతో జగన్ నిజస్వరూపం బయటపడింది. రాజకీయంగా తనకు ఏదైనా సమస్య వస్తే జగన్ తల్లిని, సోదరిని కూడా వదిలిపెట్టరు అన్న వాదనలు ఏపీలో విస్తృతంగా వ్యాపిస్తున్నాయి.
అదృష్టవశాత్తూ వైఎస్సార్ కన్నుమూశారని ప్రజలు అంటున్నారు. లేకపోతే జగన్ ఆయన్ను కూడా వదిలిపెట్టేవారు కాదు’ అనుకుంటున్నారు. కానీ అప్పటికే జగన్ వైయస్ ను వదల్లేదనే వాస్తవాన్ని ప్రజలు మరచిపోతున్నారు. అక్రమాస్తుల కేసుల ఎఫ్ఐఆర్ లలో వైయస్ పేరును చేర్చాలని జగన్ కోర్టుకు వెళ్లారు.