YS Jagan:జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌పై సందర్భంగా వచ్చిన ప్రతిసారి ఏపీ సీఎం వైఎస్ జగన్ సెటైర్లు వేస్తున్న విషయం తెలిసిందే. దత్తపుత్రుడని, ప్ంయాకేజీ స్టార్ అని, మ్యారేజీ స్టార్ అని విమర్శలు చేస్తున్న వైఎస్ జగన్ తాజాగా పలాసలో జరిగిన సభలో మరోసారి జనసేనానిపై విరుచుకు పడ్డారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన బర్రెలక్కకు వచ్చినన్ని ఓట్లు కూడా రాలేదని ఎద్దేవా చేశారు.
గురువారం పలాసలో వైఎస్సార్ సుజల ధార డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్‌తో పాటు కిడ్నీ రీసెర్చ్ సెంటర్‌ను, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఏపీ సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ `రూ.700 కోట్ల వ్యయంతో నిర్మించిన సుజలధార ప్రాజెక్ట్‌ను జాతికి అంకితం చేశారు. అంతే కాకుండా ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ సమస్యకు గత పాలకులు పరిష్కారం చూపించలేదని, ఇలాంటి పరిస్థితిలో తమ ప్రభుత్వం రూ.785 కోట్ల వ్యయంతో ఉద్దానం కిడ్నీ వ్యాధిగ్రస్తులకు శాశ్వత పరిష్కరం చూపించామన్నారు.
ఉద్దానం కిడ్నీ వ్యాధిగ్రస్తులకు 200 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పటల్ ద్వారా మెరుగైన సేవలను ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు. అనంతరం పవన్ కల్యాణ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. `ఆంధ్రా పాలకుకు చుక్కలు చూపిస్తానని తెలంగాణలో డైలాగ్‌లు కొట్టాడు ఈ ప్యాకేజీస్టార్. మ్యారేజీ స్టార్. ఆంధ్రాకు వ్యతిరేకంగా ఆయన కొట్టిన డైలాగులకు తెలంగాణలో పడిన ఓట్లు ఎన్నో తెలుసా?..అంటూ పంచ్‌లు వేశారు. అక్కడ ఇండిపెండెంట్‌గా నిలబడ్డ నా చెల్లెమ్మ బర్రెలక్కకు వచ్చినన్ని ఓట్లు కూడా ఈ దత్తపుత్రుడి పార్టీకి రాలేదు. డిపాజిట్లు కూడా దక్కలేదు` అంటూ ఎద్దేవా చేశారు.