YS Jagan : జగన్ కు ఓటమి భయం..అభ్యర్థులను మారిస్తే గెలుస్తారా?
YS Jagan : ఆంధ్రప్రదేశ్ లో జగన్ కు ఓటమి భయం పట్టుకుంది. ఎన్ని సర్వేలు చేయించినా వైసీపీ విజయం సాధిస్తుందని ఎవరూ మాత్రం చెప్పడం లేదు. దీంతో జగన్ లో నిరుత్సాహం పెరుగుతోంది. గెలిచే సత్తా లేని వారిని మారుస్తూ తనకిష్టమైన వారికి సీట్లు ఇస్తున్నారు. అభ్యర్థులు బలహీనంగా ఉన్న చోట్ల వారిని మార్చడానికి వెనకాడడం లేదు. ఈనేపథ్యంలో ఏం జరుగుతుందోననే బెంగ అందరిలో పట్టుకుంది.
ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ జగన్ లో ఓటమి భారం కుంగదీస్తోంది. కొన్ని చోట్ల అభ్యర్థులను తొలగించాలని చూస్తున్నారు. మైలవరం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు. చంద్రబాబు సన్నిహితుడిగా ఉండే దేవినేని ఉమను కాదని గెలుపే లక్ష్యంగా వసంతకు టికెట్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. దీంతో వైసీపీ మైలవరం ఎంపీపీగా ఉన్న తిరుపతిరావును తమ అభ్యర్థిగా ప్రకటించింది.
అయినా విజయంపై అనుమానం రావడంతో అతడి స్థానంలో మంత్రి జోగి రమేష్ ను నిలబెట్టింది. దీంతో పోరు రసవత్తరంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. మరో మంత్రి విడదల రజనీ సీటు కూడా మారుతుందని అంటున్నారు. చిలకలూరిపేట నుంచి గెలిచిన ఆమెను ఈ సారి గుంటూరు వెస్ట్ కు పంపారు. గుంటూరు ఎంపీగా పోటీ చేయించేందుకు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇలా జగన్ కు స్థిరమైన ఆలోచన లేకుండా పోతోంది. దీంతో ఆందోళనలో పడిపోతున్నారు. తమ అభ్యర్థులను ఇష్టారాజ్యంగా మారుస్తున్నారు. ఏదైనా చిన్నపాటి అనుమానం వచ్చినా మార్చేందుకు వెనకాడం లేదు. దీని వల్ల ఇబ్బందులు వస్తాయని తెలిసినా పట్టించుకోవడం లేదు. చివరకు ఏం జరుగుతుందోననే అనుమానాలు అందరిలో వస్తున్నాయి.
ఏపీలో ఎన్నికల వరకు ఇంకా ఎన్ని మార్పులు చోటుచేసుకుంటాయో? అభ్యర్థులు చివరి వరకు పోటీలో ఉండేది లేనిది తెలియడం లేదు. ఎప్పుడు అనుమానం వచ్చినా తొలగించేందుకు రెడీగా ఉన్నారు. దీంతో వైసీపీ నేతల్లో ఆందోళన పెరుగుతోంది. ఈనేపథ్యంలో ఎన్నికల నాటికి ఇంకా ఎన్ని తతంగాలు జరుగుతాయోననే భయం వస్తోంది.