YouTuber Harshasai : అత్యాచారం కేసుపై స్పందించిన యూట్యూబర్ హర్షసాయి

YouTuber Harshasai

YouTuber Harshasai

YouTuber Harshasai : ప్రముఖ తెలుగు యూట్యూబర్ హర్షసాయిపై అత్యాచారం కేసు నమోదైన సంగతి తెలిసిందే. తనను పెళ్లి చేసుకుంటానని, శారీరకంగా వాడుకొని మోసం చేశాడని ఓ యువతి మంగళవారం నార్సింగి పోలీసులను ఆశ్రయించింది. పేదలకు సేవ చేస్తున్నానంటూ యూట్యూబ్ లో రీల్స్ చేస్తున్న హర్షసాయి అనేక అరాచకాలకు పాల్పడ్డాడని ఆ యువతి ఫిర్యాదులో పేర్కొంది. పెళ్లి చేసుకునేందుకని తన నుంచి రూ.2 కోట్ల నగదు తీసుకున్నాడని, ఇందుకు ఆయన తండ్రి రాధాకృష్ణ కారణమని ఆరోపించింది.

ఈ ఘటనపై యూట్యూబర్ హర్షసాయి సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. నాపై వస్తున్న ఆరోపణలన్నీ అబద్దం. డబ్బుల కోసమే ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. నా గురించి మీ అందరికి తెలుసు. త్వరలోనే నిజానిజాలు బయటకొస్తాయి. ఈ వివాదంపై విజయవాడకు చెందిన మా లాయర్ తానికొండ చిరంజీవి త్వరలో మీ ముందుకు వస్తారు అంటూ పేర్కొన్నాడు.

TAGS