YouTuber Anvesh : అన్వేష్ కు లోకేశ్ రూ. 5 కోట్లు.. క్లారిటీ ఇచ్చిన టీడీపీ నేత
YouTuber Anvesh : ప్రఖ్యాత ‘యూ ట్యూబర్’ అన్వేష్ గురించి పరిచయం అక్కర్లేదు. ప్రపంచ యాత్ర చేస్తూ.. మధ్య మధ్యలో ట్రేడింగ్ చేస్తూ కోట్లు సంపాదించి తన టూర్లకు వాడుతుంటారు ఆయన. ఆయనకు యూ ట్యూల్ లో మిలియన్ల కొద్దీ ఫాలోవర్స్ ఉన్నారు. ఇదే కాకుండా ఇన్ స్టా, ట్విటర్ లో కూడా మరింత ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నారు. అయితే ఆయన సంపాదనలో ఎక్కువగా ఆయన టూర్ల ద్వారానే వస్తుందని ఆయన చెప్తుంటాడు. ఆయన సెన్సార్ మాటలు, తన టూర్ లోని ప్రదేశాలు, అక్కడ సంస్కృతి, సంప్రదాయాలను వివరస్తూ గడుపుతున్నాడు.
అయితే కొన్ని రోజుల క్రితం ఆయనపై కొన్ని ఆరోపణలు వచ్చాయి. ఆయన టూర్లకు కావాల్సిన డబ్బును తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి, చంద్రబాబు నాయుడు కొడుకు నారా లోకేశ్ ఇచ్చాడన్న వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ‘టూర్లు తిరుగుతూ తమ పార్టీ గురించి, చంద్రబాబు నాయుడి గురించి యూ ట్యూబ్ లో ప్రచారం చేస్తే రూ. 5 కోట్లు ఇచ్చాడని’ కొన్ని పోస్టులు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఈ విషయం నారా లోకేశ్ స్పందించారు.
ఎవరికీ తాను ఎటువంటి డబ్బు ఇవ్వలేదని నారా లోకేశ్ చెప్పాడు. ఈ వార్తలను, పోస్ట్ లను ఆయన తీవ్రంగా ఖండించారు. ఇది ముమ్మటికి తప్పుడు ప్రచారమే అన్నారు. వైసీపీ ప్రభుత్వం కావాలనే ఈ ప్రాపగండాను బయటకు తీసుకువచ్చిందని, ఆయన ‘నా అన్వేషణ’ ద్వారా రాష్ట్ర భవిష్యత్తు గురించి ప్రశ్నించడం ప్రశంసించదగినదని ఆయన ఎక్స్ (ట్విటర్)ద్వారా తెలిపారు.
There are no depths to which the YSRCP won’t sink.
YSRCP’s 5 Rupees PayTM continues to discredit those questioning @ysjagan‘s destructive policies. “Naa Anveshana” deserves praise for responsibly raising concerns about our state’s well-being and its future.… pic.twitter.com/9uHBWhoiGA
— Lokesh Nara (@naralokesh) November 24, 2023