Bhadradri Divyakshetram : భద్రాద్రి రామయ్యకు యూట్యూబ్ ఛానల్.. ‘భద్రాద్రి దివ్యక్షేత్రం’
Bhadradri Divyakshetram : భద్రాచలం రామాలయం తరపున ‘భద్రాద్రి దివ్యక్షేత్రం’ పేరిట యూట్యూబ్ ఛానల్ ను ఏర్పాటు చేసినట్లు ఆలయ ఈవో రమాదేవి మంగళవారం ప్రకటించారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రామ భక్తులకు ఆలయంలో రోజువారీ క్రతువుల గురించి తెలిపేలా ఈ యూట్యూబ్ ఛానల్ లో వీడియోలు పోస్టు చేయనున్నట్లు తెలిపారు.
ట్రయల్ గా ఒక వీడియోను కూడా అప్ లోడ్ చేశారు. ఆ వీడియోలో తెలుగు రాష్ట్రాల్లో రాములవారికి ఉన్న భూముల వివరాలు, బంగారం, వెండి ఆభరణాల వివరాలను పేర్కొన్నారు. 1300 ఎకరాల భూమి, 68 కిలోల బంగారం, 980 కిలోల వెండి ఉన్నాయని 20 నిమిషాల నిడివితో తయారు చేసిన వీడియోను.. త్వరలోనే అప్ లోడ్ చేయనున్నారు. అలాగే ఉత్సవాలకు సంబంధించిన వీడియోలను కూడా ఈ యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేస్తామని రమాదేవి వివరించారు.