Naa Anveshana Anvesh : నా అన్వేషణ అన్వేష్ .. యూట్యూబ్ లో ఓ సంచలనం. ఆయన వీడియోలకు లక్షలాది మంది అభిమానులు ఉన్నారు. దాదాపు ఆయన వీడియోలు చూడని వారుండరనే చెప్పాలి. యూట్యూబ్ సెలబ్రిటీ అతడు. ఆయన ఒక్కో వీడియోకు మిలియన్ వ్యూస్ వస్తాయి. అన్వేష్ ఉత్తరాంధ్రకు చెందిన వాడు. గతంలో అమెరికాలో ఉద్యోగం చేసిన అన్వేష్.. అక్కడ బోర్ కొట్టి క్రియేటివ్ ఫీల్డ్ వెతుక్కోవాలని యూట్యూబర్ గా మారాడు. ఇండియాకు వచ్చి.. ఇండియా ట్రిప్పు వీడియోలను చేశాడు. వాటికి మంచి ఆదరణ వచ్చింది.
ఇక ఆ తర్వాత ప్రపంచం చుట్టివస్తూ.. అన్ని దేశాలను వ్యూయర్స్ కు చూపిస్తూ ఎంతో ఆదరణ పొందాడు. కోట్ల రూపాయల సంపాదన కూడా ఆర్జించాడు. ఇతడి వీడియోల్లో యువత ఎడ్యుకేషన్ పై శ్రద్ధ పెట్టాలని, చదువుతోనే జీవితంలో ఎదుగుతామని సూచిస్తూ ఉంటాడు. నిత్యం కష్టపడి పనిచేసేతత్వం ఉండాలని, నీతి, నిజాయితీగా ఉండాలని చెబుతుంటాడు. తాజాగా ఆయన తన వీడియోలకు గుడ్ బై చెబుతున్నట్టు ఓ వీడియో పోస్ట్ చేయడం సంచలనం రేకెత్తించింది. దానికి గల కారణాలను ఆ వీడియోలో చెప్పాడు. దాని ప్రకారం..
నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా ఇటీవల అన్వేష్ బ్యాంకాక్ వెళ్లాడు. అక్కడ వేడుకల్లో పాల్గొన్నాడు. జనవరి 1 తెల్లవారుజామున అతడికి అమెరికా నుంచి ఓ యువతి ఫోన్ చేసింది. ఆమె ఒక వేశ్య. కుశల ప్రశ్నలు అడిగిన తర్వాత ఏం చేస్తున్నావని అన్వేశ్ అడిగితే బాయ్ ఫ్రెండ్ తో ఉన్నానని చెప్పింది. దానికి నీ వృత్తి అది కదా.. మరి బాయ్ ఫ్రెండ్ ఎందుకని అడిగాడు. దీనికి ఆమె.. అది నా వృత్తి..అందులో నాకు ఆనందం ఉండదు. నా మానసిక ఆనందం నా బాయ్ ఫ్రెండ్ లో వెతుక్కుంటాను అని చెప్పింది.
దీంతో తాను రియలైజ్ అయ్యాయని, అంతర్మధనంలో పడిపోయాయని అన్వేష్ చెప్పాడు. తాను నాలుగేండ్లుగా పనిరాక్షసుడిలా ప్రపంచం తిరుగుతున్నానని, ఏనాడూ హద్దు మీరలేదని, ఎప్పుడూ పని పని అంటూ తిరిగానని, వ్యక్తిగత జీవితాన్ని కోల్పోయాని చెప్పుకొచ్చాడు. తాను నిజాయితీగా ఉన్నానని, ఏ రోజు కమర్షియల్ గా ఆలోచించలేదన్నాడు. తాను చేసిన పొలిటికల్ వీడియో తనను బాగా ఇబ్బందిపెట్టిందన్నారు. అలాగే తన వీడియోలతో మిగతా చానల్ వారికి వ్యూస్ రావడం లేదని, అందరూ తన వీడియోలనే చూస్తున్నారని, దాంట్లో తన తప్పులేదని.. కానీ మిగతా వారు తనను తొక్కాలని చూశారన్నారు. ఇలా పలు కారణాల వల్ల కొన్ని రోజుల పాటు వీడియోలను ఆపివేస్తానని చెప్పారు. దీంతో సోషల్ మీడియాలో ఆయనకు మద్దతుగా చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు. కొద్ది రోజుల పాటు రెస్ట్ తీసుకుని..మళ్లీ మంచి వీడియోలతో రావాలని సూచిస్తున్నారు.