JAISW News Telugu

Jr NTR : యంగ్ టైగర్ ఎన్టీఆర్ అన్నింటిలో తోపు కానీ.. ఆ విషయంలోనే..

Jr NTR

Jr NTR

Jr NTR : నందమూరి వంశం నుంచి మూడో తరం హీరోగా ఇండస్ట్రీకి వచ్చిన ఎన్టీఆర్ మొదటి సినిమాతోనే భారీ డిజాస్టర్ చవిచూశారు. పస్ట్ సినిమా ఇలా అయితే.. మరో హీరో అయితే ఇండస్ట్రీ మనం పనికి రాం అని బయటికి పోతారు. కానీ ఎన్టీఆర్ మాత్రం ఎలాగైనా ఇక్కడే నిలదొక్కుకోవాలని పట్టుదలతో ప్రయత్నించాడు. కాబట్టి ఆ తర్వాత వనచ్చిన ‘స్టూడెంట్ నెం.1‘, ‘ఆది‘, ‘సింహాద్రి’ లాంటి వరుస విజయాలతో మాస్ హీరోగా కూడా ఎదిగాడు. మొత్తానికి ఆయన చేసిన ప్రతీ సినిమా ఇండస్ట్రీలో గుర్తింపును సంపాదించి పెట్టడమే కాకుండా ఆయన సైతం ఆర్ఆర్ఆర్ తో గ్లోబల్ స్టార్ గుర్తింపును సంపాదించుకున్నాడు. నిజానికి కొన్ని సీన్లను బాగా పరిశీలిస్తే ఆయనలా నటించే స్టార్ హీరో లేరనిపిస్తుంది.

అన్నింట్లో స్ట్రాంగ్ గా కనిపిస్తున్నప్పటికీ కొన్ని సీన్లు చేయడంలో ఆయనకు కూడా ఇబ్బందిగా ఉంటుందట. ఆ సమయంలో ఆయన చేసిన కొన్ని సీన్లు ఆడియన్స్ ను మెప్పించలేకపోతున్నాయనే వార్తలు వస్తున్నాయి. అవేంటంటే రొమాంటిక్ సీన్లు. రొమాంటిక్ సీన్లు వస్తే ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ చేయలేడు. యాక్షన్, ఎమోషన్, కామెడీ లాంటి వాటిలో నటించిననప్పటికీ రొమాంటిక్ సీన్స్ లలో మాత్రం వీక్ గా కనిపిస్తున్నాడంటూ సినిమా విమర్శకులు కూడా ఎన్టీఆర్ నటనలో ఈ విషయం గురించి తెలిపారు.

విమర్శకులు చెప్పిన విషయాన్ని ఇప్పటి వరకు కొంచెం అధిగమించినప్పటికీ ఫుల్ గా మార్చుకునే ప్రయత్నం చేయడం లేదంటూ కొంత మంది కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి ఎన్టీఆర్ వరుస సినిమాలు చేసుకుంటూ దూసుకెళ్తున్నాడు. కాబట్టి ఫ్యూచర్ లో ఒక రొమాంటిక్ సినిమా చేసైనా అందులో కొన్ని సీన్స్ చేసి తన మీద ఉన్న ఈ ఒక్క బ్యాడ్ ఒపీనియన్ ను కూడా తొలగించుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది.

Exit mobile version