heart attack : కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం పెనుమాడలో ఓ పెళ్లి వేడుక జరిగింది. వరుడి స్నేహితుడు గుండెపోటుతో మృతి చెందాడు. గోనెగండ్ల మండలం బి.అగ్రహారం గ్రామానికి చెందిన చిన్న మాదన్న, జయమ్మ దంపతుల కుమారుడు వంశీకుమార్ బెంగళూరులో సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా పనిచేస్తున్నాడు. స్నేహితుడి పెళ్లి వేడుకకు వంశీ హాజరయ్యాడు. వరుడికి స్నేహితులు అందరు కలిసి వేదిక మీద బహుమతి అందజేశారు. అనంతరం ఫొటోలు దిగుతుండగా వంశీ ఒక్కసారిగా కుప్పకూలి మృతిచెందాడు. వివాహ వేడుకలో అప్పటి వరకు తోటి స్నేహితులతో కలిసి సందడి చేసిన వంశీ కుమార్ ఆకస్మికంగా ప్రాణాలు కోల్పోవడంతో విషాద ఛాయలు అలుముకున్నాయి.