Ram Charan : #RRR వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత గ్లోబల్ స్టార్ ఇమేజి ని సొంతం చేసుకున్న రామ్ చరణ్, శంకర్ తో ‘గేమ్ చేంజర్’ అనే సినిమాని ప్రారంభించిన సంగతి తెలిసిందే. #RRR చిత్రం పూర్తి అవ్వగానే రామ్ చరణ్ ఈ సినిమా సెట్స్ లో కనిపించాడు. షూటింగ్ చాలా తొందరగా అయిపోతుందని అందరు అనుకున్నారు కానీ , మధ్యలో ఇండియన్ 2 చిత్రాన్ని తప్పనిసరిగా పూర్తి చెయ్యాల్సిన పరిస్థితి రావడం తో గేమ్ చేంజర్ షూటింగ్ ఆలస్యం అయ్యింది.
ఈ ఏడాది కచ్చితంగా సినిమా విడుదల అవుతుందా అంటే చెప్పలేని పరిస్థితి ఉంది. శంకర్ లేకపోవడం తో నిర్మాత దిల్ రాజు కొంతమంది యంగ్ డైరెక్టర్స్ తో ఈ సినిమాలోని ఫిల్లర్ సీన్స్ ని తెరకెక్కించారని ఒక టాక్ కూడా ఉంది. ఇది ఇలా ఉండగా ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్ర పోషించిన సూర్య అనే నటుడు షూటింగ్ జరుగుతున్న సమయం లో తనకి ఎదురైనా కొన్ని సంఘటనల గురించి చెప్పుకొచ్చాడు.
ఈ సినిమాలో ఆయన నెగటివ్ రోల్ లో నటించదట. ఒక ఫైట్ సన్నివేశం లో రామ్ చరణ్ ఇతన్ని కొడితే వెంటనే బౌన్స్ అయ్యి పైకి లెయ్యాలట. ఈ సన్నివేశం ఉన్న రోజే ఆయన తండ్రి చనిపోయాడట. షూటింగ్ జరుగుతున్నంత సేపు ఈ విషయాన్నీ చెప్పకుండా ఉన్నాడట సూర్య. అయితే మనసులో బాధ ఉండడం తో షాట్ మీద పూర్తిగా శ్రద్ద చూపలేకపోయాడట. దీంతో ఆ షాట్ పూర్తి చెయ్యడానికి 10 టేకులు తీసుకోవాల్సి వచ్చిందట. ప్రతీ టేకులోనూ రామ్ చరణ్ కొట్టినప్పుడల్లా అతని దగ్గరకి వచ్చి క్షమాపణలు చెప్పేవాడట. అంత పెద్ద నటుడు అయ్యుండి కూడా, ఇలా తనకి దెబ్బలు తగిలిందా లేదా అని జాగ్రత్తలు స్వయంగా చూసుకునేవాడు, అలాంటి హీరో ని నేను నా కెరీర్ లో ఇప్పటి వరకు చూడలేదు అంటూ చెప్పుకొచ్చాడు సూర్య.
ప్రస్తుతం సూర్య హీరో గా రామ్ అనే చిత్రం లో నటించాడు. ఈ సినిమా అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అందులో భాగంగా ఆయన వరుసగా ఇంటర్వ్యూస్ ఇస్తున్నాడు. అంతకు ముందు కూడా పలు సినిమాల్లో క్యారక్టర్ రోల్స్ ద్వారా ప్రేక్షకులను అలరించిన సూర్య, మొట్టమొదటిసారి ఈ చిత్రం ద్వారా హీరోగా మన ముందుకు రాబోతున్నాడు.