Viral Video: నా గ్రాఫ్ బాలేదన్నావ్..మరిప్పుడు నీ గ్రాఫ్ సంగతేందమ్మా..జీరో అయిపోయిందిగా..

Mekapati chandrasekhar Reddy-Viral Video
Viral Video : ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమితో పాతాళంలోకి పడిపోయింది. ఫ్యాన్ రెక్కలు ఊడి తుక్కుతుక్కు అయిపోయింది. తనవారంటూ ఎవరులేక జగన్ ఒంటరిగా కుమిలికుమిలిపోయే పరిస్థితికి వచ్చాడు. టీడీపీ కూటమి ఘన విజయం జగన్ కు కాళరాత్రులు మిగులుస్తోంది. పాలన అంటే అర్థం తెలియక..పాలన అంటే లక్షల కోట్లు మింగడమే అనుకున్న జగన్ అండ్ కో టీమ్ కు ప్రజలు కోలుకోలేని మరణశాసనం రాశారు.
ఈనేపథ్యంలో జగన్ సైకో చేష్టల వల్ల ఆ పార్టీని వీడి బయటకు వచ్చిన నాయకులు అందరూ ఇప్పుడు ఓపెన్ అవుతున్నారు. సంబరాలు చేసుకుంటున్నారు. ఆ పార్టీ వీడి టీడీపీ, జనసేనల్లో చేరిన కొందరు ఎమ్మెల్యేలు, ఎంపీలుగా గెలిచి ఖుషీ అవుతున్నారు. జగన్ ప్రభుత్వంలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేయకుండా క్రాస్ ఓటింగ్ కు పాల్పడిన ఆరోపణలపై సస్పైండైన నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ప్రస్తుతం ఆనందోత్సవాలు చేసుకుంటున్నారు. తాజాగా ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.
‘‘నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నాకు టికెట్ లేదని చెప్పవ్.. నీ గ్రాఫ్ బాగాలేదు శేఖరన్న అన్నాడు..సజ్జల, ధనుంజయరెడ్డి చెప్పిండట నా గ్రాఫ్ బాగాలేదని..మరిప్పుడు నీ గ్రాఫ్ సంగతేందమ్మా..నీది జీరో అయిపోయిందమ్మా గ్రాఫ్.. సున్నాకు వచ్చిందిగా నీ గ్రాఫ్..ఆంధ్రప్రదేశ్ అంతా నీ గ్రాఫ్ జీరోకి వచ్చింది.. దరిద్రుడా దరిద్రులను,సైకోలను పక్కనపెట్టుకుని దుర్మార్గాలు చేసి ఎక్కడపడితే అక్కడ వేల కోట్లు కొట్టారు..జగన్ సీఎంగానే కాదు..నాయకుడిగా కూడా పనికిరాడు..’’ అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.