YS Jagan : ఆంధ్రప్రదేశ్ లో జగన్ మలివిడత ప్రచారం ప్రారంభించారు. కడప నుంచే తన ప్రచార హోరు కొనసాగించనున్నారు. కడప ఎంపీ అభ్యర్థిగా అవినాష్ రెడ్డి, పులివెందుల ఎమ్మెల్యే అభ్యర్థిగా జగన్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ మేరకు ప్రచారాన్ని ముమ్మరం చేయనున్నారు. ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించి ఇక యుద్ధ ప్రాతిపదికన సభలు, సమావేశాలు నిర్వహించాలని భావిస్తున్నారు.
రాయలసీమ కల్చర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాయలసీమ బిడ్డలు ఎవరికీ భయపడరు. మంచితనంతో ముందుకు వెళతారు. బెదిరింపులకు లొంగరు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టారు. ప్రజలు మా వెంటే ఉన్నారు. మాకే ఓట్లు వేస్తారని ధీమాగా ఉన్నా వైసీపీ నేతల్లో భయం కనిపిస్తోంది.
ఓటమి భయం వారిని వెంటాడుతోంది. దోపిడీలు, దొంగతనాలు, కబ్జాలు, హత్యలు, మానభంగాలు ఇలా ఒకటేమిటి వరస తప్పులు చేస్తూ వైసీపీ నేతలు నిస్సిగ్గుగా వ్యవహరిస్తున్నారు. ఇదేంటని అడిగితే కేసులు పెడుతూ దాడులకు తెగబడుతున్నారు. ఎన్నికల కమిషన్ నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. వలంటీర్లతో అన్ని పనులు చేయించుకుంటున్నారు.
వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి పాత్రలేదని తాను నమ్మినందునే టికెట్ ఇచ్చానంటున్నారు. వివేకాను ఎవరు చంపారో అందరికి తెలుసని అంటున్నారు. వివేకాకు రెండో వివాహం, రెండో సంతానం ఉందని గుర్తు చేశారు. అనవసరంగా మాపై నిందలు వేస్తున్నారని మండిపడుతున్నారు. ఎవరు నేరం చేశారో త్వరలో బయటపడుతుందని అంటున్నారు.
తన చెల్లెలు షర్మిలపై కీలక వ్యాఖ్యలు చేశారు. తన చెల్లెలుకు లేనిపోని ఆశలు కల్పించి తనపై వదిలేశారని చెబుతున్నారు. కానీ నిజం నిలకడ మీదే తెలుస్తుంది. తనను బదనాం చేయడానికే నిర్ణయించుకున్నారని జగన్ మండిపడుతున్నారు. అయితే ఆమె ఎందుకలా చేస్తున్నారో జగన్ కు తెలియంది కాదు. ప్రచార సభల్లో సింపతీ కోసం జగన్ చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయో లేదో జూన్ 4న తేలనుంది.