Chandrababu : నువ్వే రావాలి చంద్రన్న..
Chandrababu : ఆంధ్రప్రదేశ్ లో రేపు (మే 13) పోలింగ్. అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అధికారులు పోలింగ్ స్టేషన్ల వద్దకు చేరుకున్నారు. నిన్ననే (మే 11) సాయంత్రం 4.30 గంటలకు ప్రచారం కూడా ముగిసింది. ఈ రోజు (మే 12) ఓటర్లను ప్రసననం చేసుకునేందుక నాయకులు, అభ్యర్థులు తాయిళాలు ఇస్తూ తమ వైపునకు తిప్పుకునే ప్రయత్నం చేస్తారు. అందుకే పోలింగ్ కు ఒక రోజు ముందు పరిస్థితిలో పూర్తి మార్పులు వస్తాయ. ఓడిపోతాను అనుకున్న వారు గెలవడం, గెలుస్తామని ధీమాగా ఉన్న వారు ఓడిపోవడం ఈ రోజే నిర్ణయం అవుతుంది.
ఇదంతా పక్కన పెడితే నేడు పోలింగ్. దేశంలో ప్రతీ పౌరుడు ఓటు వేయాలి. గ్రామీణ ప్రాంతాల్లో 90 సంవత్సరాలు వచ్చిన వృద్ధులు కూడా ఓటు వేసేందుకు బూత్ లకు తరలిస్తుంటే యువత మాత్రం ఓటు వేసేందుకు రావడం లేదు. ‘ఓటు వేయకుంటే చచ్చిన వరితో లెక్క’ జనాభా లిస్ట్ లో తమ పేరు తీసేస్తారని ప్రజలు పెద్దలు నమ్మేవారు అందుకే వారు ఓటేసేందుకు వచ్చేవారు. ఇప్పటికీ గ్రామీణుల్లో ఓటు శాతం 90 కి పైగానే ఉంటే పట్టణాల్లో మాత్రం 50 వరకు వచ్చేందుకు ముప్పు తిప్పలు అవుతాయి.
ఇక నేడు పోలింగ్ కాబట్టి మళ్లీ చంద్రబాబు పాలన రావాలని ఏపీ ప్రజలు కోరుకుంటున్నారు. అందుకే సోషల్ మీడియాలో చంద్రబాబు రావాలి. మనం బాగుపడాలన్న పాటలు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ వీడియో చూడండి చంద్రబాబు రావాలని ఎంత ఆసక్తిని కనబరుస్తుందో..