JAISW News Telugu

different name : ఇంత డిఫరెంట్ పేరు మీ జీవితంలో ఎప్పుడు చూసి ఉండరు.. ఆ పేరెంటో తెలుసుకోండి

different name

different name

different name : చాలామంది తమకు పుట్టిన పిల్లలకు వినూత్నంగా పేర్లు పెట్టాలని ప్రయత్నం చేస్తుంటారు. అలా కొంతమంది క్రికెటర్ల పేర్లు మరి కొంతమంది దేవుళ్ళ పేరు మరి కొంతమంది సెలబ్రిటీల పేర్లు పెడుతూ తమ ఆశయాలు తీర్చే వారిగా తమ పిల్లలని భావిస్తూ ఉంటారు. కొంతమంది సచిన్ అని  మరికొంతమంది ప్రభాస్ అని ఇంకొంతమంది నాగచైతన్య అని ఇలా ఎన్నో రకాల పేర్లు పెట్టుకుని ఆనందపడుతున్నారు.
 ఇంకొంతమంది దేవుళ్ళ పేర్లు పెట్టుకుంటారు. నారాయణ నుంచి శివ శంకర్ ఇలా అనేక రకాల పేర్లు పెట్టుకుంటారు. ఇదే కాకుండా అన్ని మతాలవారు అన్ని కులాల వారు అన్ని ప్రాంతాల వారు తమ ఇష్టదైవాల పేర్లు పెట్టుకోవడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు. తమ మతం తమ ధర్మం అనుసరించి వారి కుమారులకు కుమార్తెలకు పేర్లు పెడుతూ ఉంటారు. ఆ పేర్లతోనే వారిని జీవితాంతం పిలుచుకుంటారు.
 ఇలా ఎన్నో రకాల వైవిధ్యమైన పేర్లు మన నిజ జీవితంలో ఎప్పుడు కనిపిస్తూ ఉంటాయి.  ఆంధ్రప్రదేశ్ జ అనంతపురం జిల్లాకు చెందినటువంటి తాడిపత్రి ప్రాంతానికి చెందిన సిహెచ్ రాఘవేంద్ర
తన కొడుకుకి కులం, మతం, ప్రాంతం అనే తేడా లేకుండా పేరు పెట్టాడు. సిహెచ్ వన్ టూ సిక్స్ అని వినూత్నంగా పేరు పెట్టాడు. దీంతో అందరూ షాక్ అవుతున్నారు. ఏంటి ఇలా  పేరు పెట్టడం అని ఆలోచిస్తున్నారు. అయితే దీనికి అర్థం కూడా ఆయన చెప్పేశారు.
 వన్ అంటే i, టూ అంటే iam , సిక్స్ అంటే indian అని అర్థం వచ్చేలా పేరు పెట్టాడు. అంటే ఐ యాం ఇండియన్ అని అర్థం వచ్చేలా పేరు పెట్టాడు. దీంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇలాంటి వినూత్నమైన ఆలోచన ఈయనకి ఎలా వచ్చిందని ఐ యాం ఇండియా అని పేరు పెట్టడం హర్షం వ్యక్తం చేయాల్సిన విషయమని అంటున్నారు. కాగా ఈ పేరు ను ఆధార్ కార్డులో కూడా నమోదు చేసుకున్నారు.
Exit mobile version