Anupama-Tillu : సిద్దూ జొన్నలగడ్డ.. యూత్ ఐకాన్ గా మారిపోయాడు. డీజే టిల్లు హిట్ తో మాస్ హీరోగా అభిమానులను సంపాదించుకున్నాడు. తెలంగాణ యాసతో దుమ్ముదులిపేస్తున్న ఈ హీరోకు మంచి ఫాలోయింగే ఉంది. చాలా సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు వేసిన సిద్దూ ‘గుంటూరు టాకీస్’తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తర్వాత కృష్ణ అండ్ హిస్ లీల, మా వింత గాథ వినుమా ఫర్వాలేదనిపించాయి. ఆ తర్వాత వచ్చిన ‘డీజే టిల్లు’తో ఒక్క సారిగా క్రేజీ హీరో అయిపోయాడు. ఈ సినిమాలో అతడిది వన్ మ్యాన్ షో. సిద్దూ కామెడీ టైమింగ్ కూడా అద్దిరిపోతోంది.
డీజే టిల్లుకు ఉన్న క్రేజ్ పార్ట్ 2ను ‘టిల్లూ స్క్వేర్’ పేరుతో మేకర్స్ తీసుకొస్తున్నారు. ఇందులో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్ సూపర్ హిట్ అయ్యాయి. వీటిలో అనుపమ రెచ్చిపోయిన తీరు చూస్తే కుర్రకారు గుండెలు గల్లంతయ్యాయనే చెప్పాలి. ఫస్ట్ టైం అనుపమ ఇంత బోల్డ్ గా నటించింది.
రీసెంట్ గా ఈ సినిమా నుంచి ఓ బ్రేకప్ సాంగ్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ కు మూవీ టీమ్ హాజరయ్యారు. అయితే మీడియా ఫొటోలు తీస్తున్న సమయంలో సిద్దూ అనుపమతో కలిసి ఫోజులిచ్చాడు. అయితే ఆమెకు తన చేతిని తగలకుండా ఫొటోలు దిగడం అందరూ రియాక్ట్ అవుతున్నారు. సినిమాల్లో కొంటె వ్యక్తిగా కనపడే సిద్దూ బయట చాలా సంస్కారవంతుడని కామెంట్స్ చేస్తున్నారు. ఇక కొందరు హీరోలు హీరోయిన్లు ఎప్పుడు తాకుతామని, హగ్ చేసుకుందామా.. కిస్ పెట్టుకుందామా అని చూస్తే సిద్దూ మాత్రం అనుపమను చేయితో కూడా తాకకపోవడం చూసి పాజిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ‘‘ అందరూ హీరోల్లా అనుకున్నాం కానీ.. అన్న నువ్వు ఇలా చేస్తావనుకోలేదు.. హాట్సాఫ్ అన్న’’ అంటూ కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి.