Harassment : ప్రేమించలేదని కసితో.. గురువుకే వేధింపులు..ఛీ ఇలాంటి అమ్మాయిలు కూడా ఉంటారా?

Harassment

student Harassment

Harassment : ప్రస్తుత సమాజంలో విలువలు లేకుండా పోతున్నాయి. అన్నా చెల్లె, గురువు శిష్యులు..లాంటి ఏ బంధాలకు గౌరవం లేకుండా పోతోంది. సోషల్ మీడియా కాలంలో మనకు లొంగని వారిని అభాసుపాలు చేయడానికి నానా కుట్రలు పన్నే ప్రబుద్ధులు తయారయ్యారు. వారి కుటుంబాన్ని అప్రతిష్ట పాలు చేయడానికి కూడా వెనకాడడం లేదు. దీనికి ఆడ, మగ తేడా లేకుండా పోయింది. మోసగాళ్లలో ఆడవారి సంఖ్య ఎక్కువగా ఉండడం బాధాకరం.

మహిళలను దేవతలుగా కొలిచే మన దేశంలో పురుషులకు సైతం వారి నుంచి వేధింపులు ఎక్కువవుతున్నాయి. ఇంట్లో భార్యల గృహ వేధింపులు తాళలేక ఆత్మహత్యలు చేసుకున్నవారు ఎందరో. అలాగే ప్రేమించడం లేదని పురుషుల గౌరవ ప్రతిష్ఠలను మంటగలిపిన వారు ఎందరో.. నేరానికి ఆడ, మగ తేడా లేదు. నేరం ఎలాంటిదైనా ఆవేదన పడేది బాధిత కుటుంబమే.

తాజాగా హైదరాబాద్ లో ఓ యువతి తనను ప్రేమించాలని, పెళ్లిచేసుకోవాలని పెళ్లైన వ్యక్తిని వేధించిన సంఘటన బయటకు వచ్చింది. సిగ్గుపడాల్సిన విషయం ఏంటంటే బాధితుడు ఆ యువతికి పాఠాలు చెప్పిన గురువు కావడం గమనార్హం. ఉన్నత లక్ష్యం కోసం హైదరాబాద్ కు వచ్చిన సదరు యువతి ఇలా చేయడం అందరినీ షాక్ గురిచేసింది.

తన ప్రేమను తిరస్కరించాడన్న కోపంతో విద్యాబుద్ధులు నేర్పిన గురువు కుటుంబాన్నే లక్ష్యంగా చేసుకుని వేధిస్తున్న యువతిని హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు షాక్ గురిచేస్తున్నాయి. ఇంతకీ కథ ఏంటంటే.. ఏపీలోని అనంతపురం జిల్లాకు చెందిన యువతి గ్రూప్-1 కోచింగ్ కోసం హైదరాబాద్ వచ్చింది. కోచింగ్ సెంటర్ ఫ్యాకల్టీని పెళ్లి చేసుకోవాలని కోరింది.

తనకు ఇంతకుముందే పెళ్లయిందని, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని ఆయన సున్నితంగా తిరస్కరించారు. దీంతో కక్ష పెంచుకున్న యువతి.. గురువు కుటుంబ సభ్యుల ఫొటోలు సేకరించింది. వాటిని మార్ఫింగ్ చేసి అసభ్యకరమైన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. యువతిని అరెస్ట్ చేశారు.

గ్రూప్-1 వంటి ఉన్నత లక్ష్యం కోసం పరాయి ఊరికి వచ్చి ఓ యువతి ఇలా చేయడం సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేస్తోంది. అసభ్యకర ఫొటోలను సోషల్ మీడియాలో పెట్టడం లాంటి సంఘటనల్లో ఎక్కువగా నిందితుల్లో పురుషులే ఉంటారు. కానీ ఓ యువతి ఇలా చేయడం, సాటి మహిళ అని చూడకుండా ఇలా ప్రవర్తించడంతో సమాజం ఎటుపోతోంది అని బాధపడాల్సిన అవసరం వచ్చింది. ప్రస్తుతం ఆమె తన బంగారు భవిష్యత్ ను కోల్పోయి ఊచలు లెక్కించాల్సి వస్తోంది.

TAGS