PM Internship : కేంద్ర ప్రభుత్వం యువతలో నైపుణ్యం పెంచేలా ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రధాని మోదీ ప్రభుత్వం పీఎం ఇంటర్న్ షిప్ ప్రోగ్రాం చేపట్టింది. దీని కోసం దరఖాస్తులు కూడా తీసుకుంటుంది. ఈ ప్రోగ్రాంకు సెలక్ట్ అయిన ఒక్కో విద్యార్థికి రూ. 5000 చొప్పున ఏడాదికి రూ. 60 వేల స్టైఫండ్ లభిస్తుంది. రానున్న అయిదు సంవత్సరాల్లో టాప్ 500 కంపెనీల్లో పని చేసేందుకు కోటి మందికి నైపుణ్యాలు కల్పించేలా ఈ స్కీమ్ ను ఉద్దేశించింది.
రూ. 800 కోట్ల ఖర్చుతో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించి.. డిసెంబర్ నుంచి ఇంటర్న్‌షిప్ అందించేందుకు రెడీ అవుతోంది. ఈ పథకం కోసం అప్లై చేసుకునేందుకు https://pminternship.mca.gov.in/login/ కు వెళ్లాల్సి ఉంటుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో దాదాపు 1.25 లక్షల మందికి ఇంటర్న్‌షిప్ అందించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అభ్యర్థులు ఎవరైనా ఈ లింక్‌కు వెళ్లి.. రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. 21-24 ఏళ్ల వారు అర్హులు. SSC పాసైన అభ్యర్థులతో పాటు.. పాలిటెక్నిక్, బీఏ, బీఎస్సీ, బీఫార్మసీ, బీబీఏ, ఐటీఐ, వంటి డిగ్రీలు ఉన్న వారు అప్లై చేసుకోవచ్చు.
ఈ ప్రోగ్రాంలో నెలవారీగా రూ. 5 వేల చొప్పున క్యాండెట్ కు ఆర్థిక సాయం అందిస్తారు. కంపెనీలో చేరే ముందు ఇచ్చే రూ. 6 వేలు వన్‌టైమ్ గ్రాంట్ కూడా ఇస్తారు. మొత్తం ఏడాదిలో ఇలా రూ. 66 వేలు వస్తాయి. దీంట్లో సగం కాలం క్లాసులో.. మిగతా సగం ఉద్యోగ ట్రైనింగ్ లో గడపాలి. ఇంటర్న్‌షిప్‌లో చేరే వారికి వ్యక్తిగత బీమా సౌకర్యం కూడా ఉంటుంది.