Chandrababu : ప్రజాస్వామ్యంలో నిర్ణేతలు ప్రజలే. వారితో కీర్తించుకున్న నాయకుడికి భవిష్యత్ ఉంటుంది. కానీ నాయకుడి పరివారంతో కీర్తించిపించుకుంటే ఆ నాయకుడు కాలగర్భంలో కలిసి పోవాల్సిందే. ఇది ఏపీ మాజీ సీఎం జగన్ విషయంలో స్పష్టంగా కనిపిస్తుంది. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మంత్రుల నుంచి సాధారణ కార్యకర్తల వరకు ‘నువ్వే మా నమ్మకం.. నువ్వే మా బలం..’ అంటూ కీర్తించారు. సాధారణంగా ఈ మాటలు ప్రజల నుంచి వస్తే నేడు వైసీపీకి ఈ గది పట్టేది కాదు.
అప్పటికీ ఇప్పటికీ తేడా ఏంటంటే. అప్పుడు నాయకులు పరివారం మాత్రమే జనగ్ ను కీర్తించారు. కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రజల నుంచి సినీ ఇండస్ట్రీ, రవాణా, రియల్ ఎస్టేట్, ఇండస్ట్రీస్, అక్వా, డెయిరీ ఇలా ప్రతీ సంస్థ ‘నువ్వే మా నమ్మకం.. బాబు’ అంటూ కీర్తిస్తున్నారు.
ఆ మార్పు ప్రమాణ స్వీకారం అప్పుడే మొదలైంది. జగన్ అవమానించిన చిరంజీవి, రజనీకాంత్ కు మోడీ నుంచి గౌరవ మర్యాదలు దక్కాయి.
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వారిపట్ల ఎంత ఆప్యాయంగా వ్యవహరించారో అందరూ చూశారు. వేదికపైనే చిరంజీవి, బాలకృష్ణ ఆప్యాయంగా ఆలింగనం చేసుకోవడం చూశారు.
ప్రమాణ స్వీకారం తర్వాత చంద్రబాబు రామ్ చరణ్ వంటి సినీ ప్రముఖుల వద్దకు వెళ్లి పలకరించారు. సినీ పరిశ్రమకు ఏపీలో మంచి రోజులు మొదలయ్యాయని అంతా అనుకుంటున్నారు. మూడు రాజధానుల ప్రతిపాదనతో రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ దారుణంగా దెబ్బతింది. పైగా వైసీపీ బెదిరింపులు, ఇసుక మాఫియా, భూ కబ్జాలతో రియల్ రంగం ఐదేళ్లుగా నరకం చూసింది.
కానీ ఇప్పుడు అమరావతి ఒక్కటే రాజధాని, విశాఖకు పరిశ్రమలు, టీ కంపెనీలు తెచ్చి ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేస్తామని చంద్రబాబు విస్పష్టంగా ప్రకటించడంతో రియల్ ఎస్టేట్ రంగానికి మంచి రోజులు మొదలయ్యాయని చెప్పవచ్చు. రాష్ట్రంలోని భారీ పరిశ్రమలు, చిన్న మధ్య తరహా పరిశ్రమలు జగన్ పాలనలో సమస్యలు ఎదుర్కొన్నాయి. ఆక్వా రంగంలో ఏపీ నెం. 1లో ఉంది. జగన్ ప్రభుత్వం విద్యుత్ చార్జీలు పెంచేసి దాన్ని కూడా దెబ్బ తీసింది.
గ్రానైట్, సిమెంట్ పరిశ్రమలు, వైసీపీ నేతల వేధింపులు, ఒత్తిళ్లతో విలవిలాడిపోయింది. జగన్ ప్రభుత్వ బాధిత రంగాల్లో రవాణా, పాడిపరిశ్రమ ఉన్నాయి. అవన్నీ చంద్రబాబు నాయుడిపై కోటి ఆశలు పెట్టుకున్నాయి.
ప్రపచంలోని గూగుల్, మైక్రోసాఫ్ట్ లను తెలుగు వారు ఏలేతుంటే ఏపీలో ఐటీ రంగం డెవలప్ అనే మాటే లేకుండా పోయింది. ఈ ఐదేళ్ల జగన్ పాలనలో ఏపీలోని ఐటీ కంపెనీలు మూతపడగా మరికొన్ని పొరుగు రాష్ట్రాలకు పోయాయి. వీటితోపాటు సాగు, టూరిజం చాలా రంగాలు జగన్ పాలనలో కొట్టుమిట్టాడుతుండేవి.
ఇలా ప్రతీ రంగం బాబు కోసం ఆతృతగా ఎదురుచూస్తోంది. ఆయన తప్పకుండా తమ సమస్యలను పరిష్కరిస్తారని ‘నువ్వే మా నమ్మకం.. బాబూ’ అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఆయన కూడా వారి ఆకాంక్షల మేరకు పనిచేస్తానని భరోసా ఇస్తున్నారు. కనుక చంద్రబాబు చేతిలో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ ఉంది. అది ఏవిధంగా మారబోతోందో త్వరలోనే అందరూ చూడవచ్చు.